మసాలా
 
 
 
 
'బిగ్ బాస్ 5' విజేత జుహీ పర్మార్

మనదేశంలో రియాల్టీ కార్యక్రమాలు ఒక ఊపులో ఉన్నారుు. ప్రతి ఛానల్లో ఒక రియాల్టీ కార్యక్రమం హైలైట్గా నిలిచి టిఆర్పీ తో గేవ్గ్సు ఆడుకుంటున్నారు. ఒక రియాల్టీ కార్యక్రమం హిట్ అరుుతే ఛానల్ కూడా హిట్ అవుతుంది. అలాంటి రియాల్టీ కార్యక్రమంలో టాప్ వరుసలో ఉన్న కార్యక్రమం ‘బిగ్ బాస్’. కలర్స్ చానల్లో ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే జిగేల్ మంటూ జరిగిన సీజన్-5 ఫైనల్ లో వరుసగా రెండవసారి మహిళ కంటెస్టెంట్ విజయం సాధించింది. గత పోటీలో ‘శ్వేత’ అనే టీవీ నటీమణి విజయం సాధించింది. సీజన్-5లో టీవి నటి ‘జూహీ పర్మార్’ టైటిల్ను కైవసం చేసుకుంది.

బిగ్బాస్ కార్యక్రమం ఎంత మనోరంజకంగా ఉంటుందంటే వివా దాలు కూడా దాన్నుంచి దూరంగా ఉండలేవు. అడుగడుగునా వివాదాలే బిగ్బాస్ విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. వివాదం ఉంటేనే విజయం ఉంటుంది అనే ఎక్తా కపూర్ కాన్సెప్ట్ను బిగ్బాస్ ఫాలో అవుతోంది. బిగ్బాస్ కార్యక్రమం విషయానికి వస్తే కొంత మంది సభ్యులను లేదా సెలబ్రిటీలను ఎంపిక చేసుకుని వారిని ఒక ఇంటిలో ఉంచుతారు. విభిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు కల వ్యక్తులు ఒకరితో ఒకరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది బిగ్బాస్పై తిలకించ వచ్చు. ఈ కార్యక్రమం కలర్స్ ఛానల్లో వస్తుంది.

సెలబ్రిటీల మధ్య అహంభావం, కోపం, తాపం, ప్రేమ, అనురాగం వంటి భావాలను నలువైపులా కనిపించని విధంగా దాచి ఉంచిన కెమరా కళ్లు ప్రతిక్షణం క్లిక్మనిపిస్తాయి. డాన్ నుంచి తప్పించుకోవడం...బిగ్బాస్ కెమరా నుంచి తప్పించుకోవడం కష్టం అని ఎస్ఎమ్ఎస్లు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. బిగ్బాస్ కార్యక్రమంలో కనిపించకుండా కంటెస్టెంట్స్ను అదరగొట్టే బిగ్బాస్ స్వరం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధిం చింది. ఇక ఈ కార్యక్రమం అయిదవ సీజన్లో సంజయ్ దత్, సల్మాన్ ఖాన్లు హోస్ట్లుగా వ్యవహరించారు.

జూహీ పర్మార్...
బిగ్ బాస్ సీజన్-5 విజేతగా ఈ ్రపముఖ టీవి సీరియల్స్ నటి ‘జూహీ పర్మార్’ ఎంపికయ్యారు.దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. జూహీని దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎస్ఎమ్ఎస్లు చేసి ఎంపికచేశారు. ఈ టైటిల్ను అమెకు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్లు అందించారు. టైటిల్తో పాటు రూ. కోటి రుపాయలను కూడా అందు కున్నారు. జూహీతో పాటు బిగ్బాస్ ఇంట్లో మరో నలుగురు ఉన్నారు. అందులో ఒక్కోక్కరిని డిస్క్వాలిఫై చేశారు.వారిలో సై్క లేదా అకాశ్దీప్ సైగల్, అమర్ ఉపాద్యాయ్, సిద్ధార్థ్ అనే సెలెబ్రిటీలు ఉన్నారు. చివరిగా బిగ్బాస్ ఇంట్లో మెహక్ చెహల్, జూహీ మాత్రమే మిగి లారు. దీంతో స్వయంగా సల్మాన్, సంజయలు ఇంట్లోకి వెళ్లి వారిని బయటికి కలర్ఫుల్ స్టేజ్పైకి తీసుకొచ్చి విజేతకు టైటిల్ను అందజేశారు.

వివాహం...
జూహీ పర్మార్ టివీ పర్సానాలిటీ, వాణిజ్యవేత్త అయిన సచిన్ ష్రాఫ్ను వివాహం చేసుకున్నారు. ఆమె అనేక వివాదాస్పద రియల్టీ కార్యక్రమాలలో పాల్గొ న్నారు. అందులో ‘పతీపత్నీ ఔర్ వో’, ‘మా ఎక్స్చేంజ్’ అనే కార్యక్రమాలు ఉన్నాయి. రియాల్టీ కార్యక్రమాల వల్ల మంచి గుర్తింపు వచ్చిం ది. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులు తయారయ్యారు.

మిస్ రాజస్థాన్...
బుల్లి తెర పై హల్ చల్ చేయడానికి ముందు ఆమె అనేక బ్యూటీ కాంపి టీషన్స్లో పాల్గొన్నారు. అనేక వాటిలో ఫైనల్ స్థాయివరకు కూడా వచ్చారు. అయితే 1999 సంవత్సరం ఆమెకు టర్నింగ్ పాయింట్. అదే సంవత్పరం ఆమె ‘మిస్ రాజస్థాన్’ అందాల కిరిటాన్ని కైవసం చేసుకున్నారు. స్టార్ప్లస్ ఛానల్లో వచ్చే కుంకుమ్ సీరియల్లో ఆమె నటనకు గాను ఆమెకు 2005లో ఇండియన్ టెల్లీ ‘ఉత్తమ నటి’ అవార్డు వరించింది. బిగ్ బాస్ టైటిల్ సాధించాక ఆమె మాట్లాడుతూ ‘ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ వంటిది. నాకు నా కెరీర్లో నా బరువు పెద్ద అడ్డంగా నిలించింది. అది తగ్గించాక మళ్లీ సీరియల్స్లో నటి ద్దామని అనుకున్నాను. చాలా కష్టపడి వెయిట్ తగ్గించాను.బిగ్ బాస్ విజయం నాలో మరింత కసిని నింపింది. ఇక నటనకు మళ్లీ హాయ్ చెబుతాను’ అని తెలిపింది.

జూహీ ఎట్ బిగ్బాస్...
జూహీ పర్మార్ బిగ్బాస్ కార్యక్రమంలో అక్టోబర్2, 2011న మిగితా 13 మంది సభ్యులతో పాటు ప్రవేశించారు.కుంకుమ్ సీరియల్ స్టార్ అయిన జూహీ అనేక వివాదాల్లో, అనేక వాద నల్లో పాల్గొంది. అయితే నెగెటివ్ ఇమ్ప్రెషన్ పడకుండా జాగ్రత్త పడింది. దాంతో విజయానికి మార్గం సుగమం అయ్యింది. కార్యక్రమంలో సిద్ధార్థ్, సన్నీ లియాన్తో అనేక సార్లు అమెతో గొడవకు దిగినా అమె వాటిని పట్టించుకోలేదు.