Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
హిందూమతంలోకి జూలియా రాబర్ట్స్

      సుప్రసిద్ధ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ హిందువుగా మారిపోయారు. ‘ఈట్, ప్రే అండ్ లవ్’ సినిమా షూటింగ్ కు గత ఏడాది సెప్టెంబర్ లో ఢిల్లీ వచ్చినప్పుడు జూలియా గుట్టు చప్పుడు కాకుండా మతం మార్చుకున్నారట. గుర్ గావ్ లోని హరి మందిర్ లో ఆ సినిమా షూటింగ్ సందర్భంగా, గుడిలోకి భక్తుల ప్రవేశం పై అధికారులు ఆంక్షలు విధించిన ఫలితంగా ఆనాడు పెద్ద వివాదం చెలరేగింది. పత్రికలు జూలియాపై దుమ్మెత్తిపోశాయి. తనను తాను తెలుసుకొనేందుకు హిందూ ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించే పాత్రను ఈ సినిమాలో పోషించిన జూలియా నిజజీవితంలో కూడా హిందూ మతాన్ని స్వీకరించడం విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన 42 ఏళ్ల జూలియా రాబర్ట్స్ ‘ప్రెట్టీ ఉమన్’ సినిమాలో వేశ్య పాత్ర పోషణతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించారు. ‘నేను ఇప్పుడు కచ్చితంగా హిందువునే’ అని తాజాగా ప్రకటించి సంచలనం సృష్టించిన జూలియా లాస్ ఏంజెలిస్ లోని హిందూ దేవాలయానికి తన భర్త ముగ్గురు పిల్లలతో క్రమం తప్పకుండా వెళ్తూ పూజలు పునస్కారాలు చేస్తూ మనశ్శాంతి పొందుతున్నారు. వచ్చే జన్మలో హిందువుగా పుట్టి శాంతి సౌఖ్యాలతో జీవించాలన్నది తన స్వప్నంగా జూలియా చెప్పుకుంటున్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005