మసాలా
 
 
 
 
అందంతో పాటు సేవాగుణం... జూలియా రాబర్ట్స్‌
హాలీవుడ్‌ అందాల తార.. జూలియా రాబర్ట్స్‌.. కేవలం అందమేకాదు.. అభినయంతోనూ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. బాక్సాఫీస్‌ పరంగా కూడా విజయం సాధించిన నటిగా పేరు పొందింది. శక్తివంతమైన మహిళగా.. అత్యధిక రెమ్మునరేషన్‌ తీసుకునే నటిగా ఆమె గురించి తెలిసిందే.. వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో ఆమె వివాదాల్లోనూ ఇరుక్కుంది. ఇవన్నీ ఆమెకు ఒకవైపు.. మరో వైపు ఆమె చూస్తేనే తెలుస్తుంది.. ఆమెలోని ఔదార్యం.. మహిళగా ఆమె నిర్వర్తిస్తున్న కర్తవ్యం.. అనేక స్వచ్ఛంద సంస్థలకు ఆమె విలువైన సమయాన్ని కేటాయిండం...

జూలియా అక్టోబర్‌ 28, 1967న అట్లాంటాలోని జార్జియాలో జన్మించింది. ఆమె అన్న ఎరిక్‌ రాబర్ట్స్‌, చెల్లీ లీసా కూడా నటీనటులే. 1971లో జూలి యా తల్లి, దండ్రి విడిపోయారు. జూలియా తల్లి దగ్గరే వుండిపోయింది. ఫిట్జామ్‌ లీ ఎలిమెంటరీ స్కూల్‌, గ్రిఫాన్‌ మిడిల్‌ స్కూల్‌, క్యాంప్‌బెల్‌ హైస్కూలులో చదివింది. పాఠశాలలో రాబర్ట్స్‌ప బ్యాండ్‌లో క్లారీనెట్‌ను వాయించేది. బాగా చదివి పశువైద్యురాలు కావాలనుకుంది. కానీ సై్మర్నాలోని క్యాంపెబెల్‌ నుండి పట్టభద్రురాలు అయిన తర్వాత తన సోదరుడు, సోదరిని కలుసుకుని నటనా వృత్తి కోసం న్యూయార్క్‌ చేరుకుంది. మొట్టమొద టి సారి బ్లడీ రెడ్‌ చిత్రంలో ఆమె నటించింది. అందులో ఆమెది కేవలం సహాయ పాత్ర మాత్రమే. తరువాత ‘ది సరె్వైవర్‌’ అనే డాకుమెంటరీలో నటించింది. తరువాత ఆమెకు ఎదురు లేకుండా పోయింది. ఆమె నటనను చూసి ఎంతో మంది ఆమెకు అవకాశాలు ఇచ్చారు. అతి కొద్ది కాలంలోనే అవార్డు విన్నింగ్‌ నటిగా పేరుతెచ్చుకున్నారు.

సంచలనాలు...
జూలియా చిత్రాలు అమెరికా బాక్స్‌ ఆఫీస్‌లో సుమారు 23 మిలి యన్‌ డాలర్లు ఆర్జించాయి. ఆమె అధిక వసూళ్ళు సాధించిన మహిళా చలన చిత్ర నటిగా మంచి పేరు సంపాదించుకుంది. జేమ్స్‌ ఉల్మెర్‌ రూపొందించిన ఒక స్వతంత్ర స్టూడియో చలన చిత్రాల్లో నటులు, దర్శకు ల జాబితాలో ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకుంది. ఈ స్థానంలోని ఇతర నిష్ణాతులు టామ్‌ క్రూస్‌, టాహ్‌ హ్యాంక్స్‌ వంటి వారున్నారు.

వ్యక్తిగత జీవితం...
రాబర్ట్స్‌ వ్యక్తిగత జీవితం తరచూ చర్చనీయాంశం అయ్యింది. ఆమె పలు ప్రసిద్ధ వ్యక్తుల తో సంబంధాలు కలిగి వున్నట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి. కొంత కాలం ఆమె స్టీల్‌ మా గ్నో లియస్‌ సహాయ నటుడు మెక్‌డెర్మాట్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. తరువాత ఆ అభిప్రాయా న్ని మార్చుకుంది. అనంతరం 1991లో సదర్లాండ్‌తో నిశ్చితార్థాన్ని ప్రకటించింది. కానీ పెళ్ళికి మూడు రోజుల ముందు దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 2000 సంవత్సరంలో ఆమె కెమెరామెన్‌ డాని యల్‌ మోడెర్‌ను వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తరువాత విడిపోయారు. ప్రస్తుతం ఆమె భర్త టాయోస్‌తో వుంటోంది. ఆమెకు ముగ్గురు పిల్లలు.

సేవా నిరతి...
రాబర్ట్స్‌ యునిసెఫ్‌ అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలకు సమయాన్ని, వనరులను అనేక సార్లు కేటాయించింది. 1995నుండి ఆమె స్వచ్ఛంద సంస్థలకు పనిచేస్తోంది. యునిసెఫ్‌ మద్దతుదారుగా.. అనేక విపత్తులలో విరాలాలు సేకరించింది. సేవా కార్యక్రమంలో భాగంగా ఒక సారి ఆమె పోర్ట్‌-యు-ప్రిన్స్‌కు చేరుకున్నప్పుడు అక్కడి దారిద్రాన్ని చూసి చాలా బాధపడింది. ‘నా గుండె పగిలిపోతుంది’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె అక్కడికి వెళ్ళిన సందర్భంగా 10 మిలియన్‌ డాలర్ల విరాలాలు సేకరించింది.

2000 సంవత్సరంలో లాస్‌ ఎంజిల్స్‌, బాల్టిమోర్‌, న్యూయార్క్‌ల్లో చిత్రీకరించిన డాక్యుమెంటరీలో నాడీ అభివృద్ధి లోపం రెట్టే సిండ్రోమ్‌ గురించి ఒక ‘సైలెంట్‌ ఏంజిల్స్‌’లో వివరించింది. దీనిపై అవగాహన కల్పించేందుకు కృషి చేసింది. 2006లో భూమి జీవ ఇంధనాలు, పునరుద్ధరణ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన సలహా మండలికి సంస్థ ప్రతినిధిగా వ్యవహరించింది. ప్రకృతి విలయాలు వంటి సందర్భాల్లో తన రాబడిలో అధిక మొత్తాలను ఆమె విరాలంగా ఇచ్చింది. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళింది. ఇప్పటికీ ఆమె సేవా సంస్థలకు సహాయ సహకారాలను అందిస్తోంది.