బాలీవుడ్ సూపర్‌స్టార్ అమతాబ్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌లు ఒకే చిత్రంలో
కనిపించనున్నారు.
అవును ఇది నిజమే ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ ఒకే సినిమాలో నటించనుండడం సినిమా పరిశ్రమ
లో హట్‌టాిపిక్‌లా మారింది బాలీవుడ్‌లో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న బిగ్‌బి అమితాబ్,
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలసి నటించడానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు బిగ్‌బి
నటిస్తున్న చిత్రం హిందీ చిత్రమనుకుంటే తప్పులో కాలేసి నట్లే. ఆయన నటిస్తున్నది ఒక
మలయాళ చిత్రం.
మలయాళీ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటున్న
‘కాందహార్’ అనే మలయాళ సినిమాలో బిగ్‌బి ఒక ప్రత్యేక పాత్రలో నటించనున్నారట.
‘మోహన్‌లాల్ కేరళలో మంచి టాలెంట్ ఉండి మలయాళ సినిమా పరిశ్రమలో రాణిస్తున్న
అద్భుతమైన నటుడు. నాకు ఆయన చాలా కాలంగా తెలుసు. ఈ వృత్తిలో ఉన్న నేను ఆయన
పనితనాన్ని చాలా కాలంగా గమనిస్తున్నాను. ఆయ నది అద్వితీయ బాడీ, ఫేస్ లాంగ్వేజ్.
ఆయనకు ఏం కావాలో అదే చేస్తాడు. ఆయననుంచి అద్భుతమైన ఫలితాలను రాబట్టుకోగలం.
అవి చూడడానికి సహజంగా ఉంటాయి. ఎక్కడా‚కూడా కావాలని చేసినట్లుగా ఉండవు.ఆయనను
చూస్తే చాలా ఉత్సాహంగా కనిపిస్తారు ’ అని మోహన్‌లాల్ గురించి అమితాబ్ తన బ్లాగ్ బిగ్‌బి.బిగ్
అడ్డాడాట్‌కంలో రాసుకున్నారు.
తన సినిమాలో నటించాలని ఈ మలయాళ సూపర్‌స్టార్ అడగగానే ఎలాంటి అభ్యంతరం లేకుండా
అమితాబ్ ఒకే చెప్పాడట. ‘ మోహన్‌లాల్ నా మీద నమ్మకంతోనే తన చిత్రంలో చేయమని
అడిగాడు. అలాంటపుడు నేను ఎలా కాదనగలను. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు. నేను
ఆయన కోసం నటిస్తున్నాను’ అని బిగ్ బి చెప్పుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో
విశేషం ఏంటంటే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు అమితాబ్ ఎలాంటి రెమ్యూ నరేషన్ తీసుకోవడం
లేదంట. ఈ విషయమై ‘ మోహన్‌లాల్ చిత్రంలో మూడు రోజులు పనిచేసినందుకు ఎలాంటి చార్జ్
చేయలేదా?’ అడిగితే ‘ అలాంటి అవకాశమే లేదు. ఎలాంటి చార్జ్ లేదు.ఏం లేదు. కేవలం ఆయన
నన్ను నటించమన్నారు నేను చేశాను అంతే’ అంటూ బిగ్‌బి నవ్వుతూ సెలవిచ్చారు.
మరి ఇప్పుడు మోహన్‌లాల్‌కోసం అమితాబ్ మలయాళం నేర్చుకుంటున్నారా అంటే అదేం
లేదంట. ఈ సినిమా మలయాళ చిత్రం అయినప్పటికీ ఇందులో అమితాబ్ క్యారక్టర్ మాత్రం నార్త్
ఇండియన్ క్యారక్టరట. దీంతో చిత్రంలో ఆయ‚న డైలాగులన్నీ కూడా హిందీలోనే ఉంటాయట.
ఆయన మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్ మీదా మలయాళంలో ఆ పదాలు
వ్రత్యక్షమవుతాయట.
ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. వీరిద్దరితో పాటు యంగ్ హీరో సూర్య కూడా ఈ
చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడట.
మొత్తం మీదా ఇద్దరూ సూపర్‌స్టార్స్‌తో పాటు మరో సంచలన హీరో కలసి ఒకే చిత్రంలో
నటిస్తుండడంతో అభిమానులు త్వరలో రానున్న ‘కాందహార్’ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు.
గతంలో విమానాన్ని హైజాక్ చేసి సంచలనం సృష్టించిన సంఘటనల సమాహారమే ఈ కాందహార్.
ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో...ఈ చిత్రం కూడా సంచలనాత్మకమే అవుతుందట...
|