మసాలా
 
 
 
 
అనారోగ్యంతో ఆసుపత్రిలో కపూర్లు
కపూర్‌ కుటుంబానికి బాలీవుడ్‌లో ప్రముఖ స్థానముంది. రాజ్‌ కపూర్‌ నుంచి నేటి రణబీర్‌ వరకూ ఆ కుటుంబ సభ్యులు బాలీవుడ్‌లో తమ హవా కొనసాగిస్తున్నారు. కోయి ముజే జంగ్లీ కహే...అంటూ ఒకప్పుడు బాలీవుడ్‌ను ఒక్క ఊపు ఊపిన హీరో షమ్మీ కపూర్‌. ఇక నాటి తరం అమ్మాయిల కలల హీరోగా శశికపూర్‌ సైతం బాలీవుడ్‌లో టాప్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ సోదరులు ఇద్దరూ తమ చిత్రాలతో అభిమానులను అలరించారు. ఒకప్పటి ఈ స్టార్‌ హీరోలు ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఉండడం విచారకరం. వయసు మీరిన వీరిద్దరూ పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఒకప్పటి బాలీవుడ్‌ టాప్‌ హీరోలు శశికపూర్‌, షమ్మీ కపూర్‌లు పలు హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల హృదయా ల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ కపూర్‌ సోదరు లిద్దరూ తమదైన శైలిలో నటన, డ్యాన్సులతో ప్రేక్షకు లను రంజింపచేశారు. దీవార్‌ వంటి సూపర్‌హిట్‌ చి త్రంలో శశికపూర్‌ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటిం చారు. ఇక షమ్మీకపూర్‌ (79), శశికపూర్‌ (72)గత కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. షమ్మీ ముంబయ్‌లోని బ్రీంచ్‌ క్యాండీ ఆసు ప్రతిలో చేరి చెస్ట్‌ ఇన్‌ఫెక్షన్‌, కిడ్నీ సమస్యలతో బాధప డుతూ చికిత్సపొందుతున్నారు. ఇక శశికపూర్‌ ముంబయ్‌ అంధేరీలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబాని ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్టు డాక్టర్లు పేర్కొన్నారు.

అమితాబ్‌ పరామర్శ...
షమ్మీ, శశి కపూర్‌లకు మంచి మిత్రుడైన అమితాబ్‌ బచ్చన్‌ ఆసు పత్రులలో చికిత్సపొందుతున్న వీరి ద్దరిని సందర్శించి పరామర్శించారు.ఈ విషయమై ఆయన తన బ్లాగ్‌లో రాసుకున్నారు. ‘శశి కపూర్‌ ను ఆసుపత్రిలో చూడడం నాకు చాలా బాధ కలిగించింది. ఈ సంద ర్భంగా డాక్టర్లతో మాట్లాడితే ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని తెలిసింది. దీంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శశి తొందరగా కోలుకోవాలని నేను దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. ఇదేవిధంగా అందరూ దేవుణ్ని ప్రార్థించాలని కోరుతున్నాను’ అని బిగ్‌ బి బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘షమ్మీ కపూర్‌ను కూడా ఆసుపత్రిలో కలిసి పరామర్శిం చాను.

అనారోగ్యంగా ఉన్నప్పటికీ షమ్మీ కపూర్‌ బాధపడకుండా నాతో మాట్లాడుతూ జోక్స్‌ వేశారు. కాసేపు ఇద్దరం మాట్లా డుకొని పాత రోజులను గుర్తుచేసుకున్నాము. అనా రోగ్యంగా ఉన్నా షమ్మీకపూర్‌లో ఏ విధమైన బాధ కనిపించకపోవడం నాకు ఆశ్చర్యమేసింది. ఆయన్ని చూస్తే శరీరానికే మాత్రమే వృద్దాప్యం వచ్చింది కానీ అతని మనసు ఇంకా యువకునిలాగే ఉందని అనిపించింది ’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. ఇక శశి, షమ్మీ కపూర్‌లు తొందరగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కావాలని కోరుకుంటున్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లకూడదని వారు భావిస్తున్నారు. తమ కుటుంబాలతో కలిసి మరికొంత కాలం ఆనందంగా గడపాలని ఈ సోదరులు ఆశిస్తున్నారు. ఏమైనా ఒక తరం కలల హీరోలైన వీరు తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం.