నటనలో ఆఫర్లు కొదవలేని కరీనా వెంట వాణిజ్య ప్రకటనల కోసం కంపెనీలు క్యూ కడతాయి. ఇటీవలే పీపుల్ మ్యాగజైన్ ‘మోస్ట్ బ్యూటిఫుల్’గా
ఎంపికైంది. ‘రిఫ్యూజీ’తో బాలీవుడ్లో అడుగుపెట్టిన కరీనా ఈ ఏడాదితో 10 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా త్వరలో
విడుదలవుతున్న తన సినిమాల గురించి చెప్పింది.....
- ‘రా..ఒన్’, ‘స్టెప్ మామ్’... రెండిట్లో ఏ సినిమా ముందుగా ఈ ఏడాది విడుదలవుతుంది?
‘రా..ఒన్’ వచ్చే ఏడాది రిలీజవుతుంది. అంతకుముందే నేను నటిస్తున్న ‘గోల్ మాల్ 3’ వస్తుంది. అందులో టామ్ బోయ్ గా అలరిస్తా. తర్వాత ‘స్టెప్
మామ్’. నా కెరీర్లో ఇది చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ‘కబీ ఖుషీ కభీ ఘమ్’ (చాలాకాలం) తర్వాత కాజోల్ తో కలిసి నటిస్తున్న సినిమా ఇది. ‘ఏజెంట్
వినోద్’ ఇప్పుడిప్పుడే నడుస్తోంది.
- షాహిద్ తో చేసిన ‘మిలెంగె మిలెంగె’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది కదా...?
చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా విడుదలవుతోంది. చాలా కష్టించి చేసిన చిత్రమిది. పూర్తికావడానికి ఎక్కువ కాలం పట్టింది. అందరికీ మంచి
ఫలితాన్నిస్తుందని ఆశిస్తున్నా. ముఖ్యంగా దర్శకుడు సతీష్ కౌశిక్, నిర్మాత బోనీకపూర్... ఇద్దరికీ.
- ‘త్రీ ఇడియట్స్’కి ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. ఎలా అనిపించింది?
అక్క కరిష్మాకి, నాకూ అమీర్ ఖాన్ కలిసొచ్చిన హీరో అనుకుంటా. ‘రాజా హిందూస్తానీ’ కోసం అమీర్ కు జంటగా నటించిన అక్క అప్పుడు ఇదే
అవార్డు తీసుకుంది. ఇప్పుడు నేను. ‘త్రీ ఇడియట్స్’లో నన్ను సాధ్యమైనంత సహజంగా చిత్రీకరించారు. అమీర్, నిజజీవితంలో ఎలా వుండటానికి
ఇష్టపడతానో అలా. చాలా హ్యాపీ.
- అమీర్ తో మళ్ళీ నటిస్తారా?
కలిసి నటించడానికి ఇద్దరం చాలా చాలా ఆసక్తిగా వున్నాం. చూద్దాం.
- 200లో ‘రిఫ్యూజీ’తో ప్రారంభమైన మీ ప్రస్థానం పదేళ్ళు పూర్తిచేసుకుంది. మీ ఫీలింగ్?
సినీ పరిశ్రమలో నేనూ ఒక భాగం. అందుకు అమ్మ (బబిత), అక్క (కరిష్మా)... ఇద్దరికీ కృతజ్ఞతలు. ఈ పదేళ్లలో వ్యక్తిగా, నటిగా చాలా పరిణతి
సాధించానని నా పర్సనల్ ఫీలింగ్.
- గ్లామర్ రహస్యం?
ఇష్టమైనది తినడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, సుస్థిరమైన బాంధవ్యం, సంతృప్తికరమైన కెరీర్.
|