నన్ను సెక్సీ అని పిలవడం ఇష్టమే. అయితే అదే సమయంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి సమాంతరంగా కష్టించానన్న సంగతి గుర్తు తెచ్చుకోవాల్సిందే. నా
విషయంలో జనం తొలుత నా పనినే గుర్తించారు. తర్వాత నెమ్మదిగా దేహాకృతి, అందం గురించి ప్రస్తావించడం మొదలెట్టారు. నా వరకూ.. ఓ మంచి నటి అని
గుర్తింపు తెచ్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తాను. అయినా ఇప్పుడంతా ప్రెట్టీ, సెక్సీ, హాట్, పవర్ ఫుల్... ఇలా కాంప్లిమెంట్లు, పొగడ్తల్లోనే ముంచెత్తుతున్నారు.
రెండు సినిమాల్లో గట్టిగా ఇచ్చారు!
బికినీ అనేది ఓవర్ రేటెడ్ గార్మెట్. నా దృష్టిలో ఇప్పుడు దానికంత గుర్తింపు లేదు! ఎంతుకంటే.. ఇప్పటికే రెండుసార్లు బికినీ ధరించేశాను. 2008లో ‘తషాన్’,
2009లో ‘కంబక్త్ ఇష్క్’ సినిమాల కోసం బికినీ వేసి అభిమానుల నుంచి వార్నింగులందుకున్నా! వాటిలోకంటే... పరిమితమైన ఎక్స్పోజింగ: తో నటించిన ‘జబ్
వి మెట్’(2007), ‘3 ఇడియట్స్’(2009), ‘గోల్ మాల్ 3’ (2010).. లాంటి సినిమాల్లో అభిమానులు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు.
బికినీ వేయను!
ప్రస్తుతం బికినీ ధరించే ఓపిక లేదు. ఎందుకంటే అందుకవసరమైన దేహాకృతిని కాపాడుకోవడం చాలా కష్టం. తెరపై బికినీలో కనిపించకూడదు అని
నిర్ణయించుకోవడానికి కారణమదే. నా తదుపరి చిత్రాల్లో హాట్ గా కనిపించినా బికినీ మాత్రం లేదు.
బాడీగార్డ్ లో పొందికైన పాత్ర
ప్రస్తుత సినిమా ‘రా 1’ పాటల్లో చాలా హాట్ గా కనిపిస్తాను. మరో సినిమా ‘బాడీగార్డ్’లో మాత్రం చాలా పొందికైన పాత్ర. ఏ మాత్రం స్కిన్ షో ఉండదు. అలాగే
‘ఏజెంట్ వినోద్’లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నా.‘షార్ట్ టర్మ్ షాదీ’ చిత్రంలో ఓ బహెమియన్ (పెయింటింగ్, రచనలు చేస్తూ... ప్రత్యేక జీవన శైలి కలిగి ఉండడం)గా
నటిస్తున్నా.
సైఫ్ కి అలానే ఇష్టం
బికినీ వేయనని సైఫ్ తో అన్నా.. అదే పెద్ద ఇష్యూ కాదు. తనకి నన్ను బికినీలో చూడడం ఇష్టమే! నిజానికి నేను గ్లామరస్ గా కనిపించడమే సైఫ్ కి బాగా
నచ్చుతుంది. కంబక్త్ ఇష్క్ లో నా పాత్రను తనెంతో లైక్ చేశాడు. అందులో చాలా హాట్ గా కనిపించాననేది అతడి భావన. అలాగని ఎల్లప్పుడూ అలానే కనిపించాలనేది
సైఫ్ ఉద్దేశం కాదు. ఓ సాదాసీదా ప్లెయిన్ అమ్మాయిలా కంటే ఫ్యాషనబుల్ గా కనిపిస్తేనే సైఫ్ కి ఇష్టం.