నాకు మీడియా తీరు మొదట్నుంచీ నచ్చదు. వాళ్లు ఒక్కసారి కూడా నా గురించి మంచిగా రాయలేదు. ప్రతివారిలోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచిని వదిలేసి మీడియా చెడు గురించి మాత్రమే రాస్తుంది. ఒక్కోసారి మా గురించి మాకే తెలియని విషయాలు పత్రికల్లో చదివి షాక్ తింటూ ఉంటాం.
నాకు హిట్లు తక్కువని అందరూ అంటారు. హిట్లు తక్కువే అయి ఉండొచ్చు కానీ నేను చేసినన్ని విభిన్న పాత్రలు మరెవరూ చేసి ఉండరు.
నాకు నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు. నాకు ఎవరూ పోటీ కాదు, నేను తమకు పోటీ అని ఎవరైనా అనుకుంటే నాకు సంబంధం లేదు.
హిట్టు, ఫ్లాపులతో నాకు సంబంధం లేదు. ఓ కథతో దర్శకుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నా పెర్‌ఫార్మెన్స్‌కు మాత్రమే నేను గ్యారంటీ ఇస్తాను. నూరుశాతం నా పాత్రకు న్యాయం చేస్తాను.
ఓ సమయంలో నాకో విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది. అదేంటంటే మనం ఎత్తుకు ఎదిగేకొద్దీ మనల్ని కిందకు లాగెయ్యాలని చూసేవాళ్లు చాలామంది ఉంటారు. అక్క కరిష్మా విషయంలో అలా జరగటం చూశాను. తర్వాత నా విషయంలోనూ అదే జరిగింది.
జీవితమన్నాక కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అలాగని ఎప్పుడూ బాధల్లో బతికేయకూడదు. ఎంత కష్టమున్నా నవ్వుతూ ఉండాలి. ఆనందంగా గడపటానికి ప్రయత్నించాలి. ఇదీ నా లైఫ్ ఫిలాసఫీ.
ఓపెన్‌గా మాట్లాడేవాళ్లు, నిజాయితీగా ఉండేవాళ్లే నాకు నచ్చుతారు. అలాంటివాళ్లతోనే నేను స్నేహం చేస్తాను. అబద్ధాలు చెప్పేవాళ్ల వైపు కన్నెత్తి చూడటానికి కూడా ఇష్టపడను.
మొదట్లో నేను నా కెరీర్‌ను అంత సీరియస్‌గా తీసుకోలేదు. అది తప్పని తరువాత తెలిసి వచ్చింది. ఎంతో గొప్ప నటులున్నకుటుంబం నుంచి వచ్చిన నేను వారి పేరు మరింత ఇనుమడింప చేయాల్సిన అవసరం ఉంది. అది గుర్తించిన మరుక్షణమే నా ఆలోచనా విధానాన్ని మార్చు కున్నాను.
మా అమ్మ, అక్క నా బలం. ఆహారం నా బలహీనత. నచ్చిన ఫుడ్ కనిపిస్తే వదల్లేను. కావలసినంత తినేసి తర్వాత జిమ్‌కి వెళ్లిపోతా.
నేను చాలా ఎమోషనల్‌గా ఉంటాను. నన్ను చేసుకునే వ్యక్తి నామీద చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నా భర్త నుంచి నేను ఆకాశమంత ప్రేమను కోరుకుంటాను. అంత ప్రేమ సైఫ్ (అలీ ఖాన్) దగ్గర దొరుకుతుందని నాకు అనిపించింది. నాకేదైనా ఇబ్బంది ఎదురైతే సైఫ్ నాతో ఉన్నాడన్న ఆలోచన ధైర్యాన్నిస్తుంది. తను అన్ని విషయాల్లోనూ నాకు అండగా ఉంటాడు. నన్ను ఎప్పుడూ సంతోషంగా, నవ్వుతూ ఉండేలా చూస్తాడు.
|