కుర్రకారుకు కిక్కెక్కించే కరీనాకపూర్ తన అభిమానులకు మరింత సన్నిహితం కావాలనుకుంటోంది. ఇప్పటిదాకా
బుల్లితెర మీద అంతగా దృష్టిసారించని ఈ బుల్లెమ్మ చూపు ఒక్కసారిగా టీవీ రియాలిటీ షో మీద సారించింది. అలాగని
ఆమెకు సినిమా అవకాశాలు తక్కువయ్యాయని కాదు. ఇప్పటికే బాలీవుడ్ లో ఏకంగా 5 సార్లు ప్రతిష్టాత్మక
ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఈ ఉత్తమ హీరోయిన్ గాసిప్స్ లో కూడా ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటూనే వాటిని
ఖాతరు చేయక సైఫ్ అలీఖాన్ తో సహజీవనం చేస్తోంది. కరీనా కపూర్ త్వరలో సైఫ్ తో కలిసి ఓ బాండ్ చిత్రంలో
నటించనుంది. ‘ఏజెంట్ వినోద్’కి సీక్వెల్ గా తీస్తున్న ఆ చిత్రంలో ఈ జంట ఇచ్చిపుచ్చుకునే ముద్దులపై ఇప్పటి
నుండే బాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. త్వరలో షారూఖ్ తో కలిసి ‘రా..వన్’ లో కూడా
నటించనుంది. కాగా కరీనా నటించబోయే రియల్ టివి షో పేరు ‘మై కరీనా కపూర్ బనా చాహ్ తీ హూన్’గా
నిర్ణయించారు. ఇంకా అది ఏ ఛానల్ లో ప్రసారం అవుతుంది... మిగిలిన వివరాలు త్వరలోనే తెలుస్తాయంటోంది
కరీనా. అయినా హీరోయిన్ గా కరీనా ప్రవేశించి 10 సంవత్సరాలు కూడా పూర్తయింది. అక్కయ్య కరిష్మా కన్నా
బాలీవుడ్ పోటీలో ముందుకు దూసుకు వెళ్లిన... కరీనా ఇకముందు హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా...
తాను మాత్రం ముందు చూపుతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉంది.
|