జీరోసైజ్ సుందరాంగి కరీనా కపూర్ కు 2011వ సంవత్సరం ఆమె కెరీర్ లోనే ఓ వింత
అనుభూతిని కలిగించనుంది. ఈ సంవత్సరం ఆమె ‘కాస్ట్ లీ’ కాల్షీట్స్ ఉన్న డైరీ అంతా ‘ఖాన్’
మయంతో నిండిపోనుంది. ఇప్పటికే బెబో (కరీనా ముద్దు పేరు) షారుఖ్ ‘ఖాన్’ సరసన
‘రా.వన్’, తన ప్రియుడు సైఫ్ అలీ ‘ఖాన్’ సరసన ‘ఏజెంట్ వినోద్’, ఇమ్రాన్ ‘ఖాన్’ సరసన
‘షార్ట్ టెర్మ్ షాదీ’, సల్మాన్ ‘ఖాన్’ సరసన ‘బాడీగార్డ్’ చిత్రాలలో నటిస్తోంది. అలాగే మరో ఖాన్
అమీర్ ‘ఖాన్’ సరసన కూడా పేరు నిర్ణయించని ఓ చిత్రంలో కరీనా కపూర్తో సంప్రదింపులు
జరుగుతున్నాయి. ఆమె పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ లో
వినిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇలా ఐదుగురు ‘ఖాన్’ల సరసన ఒకే
సంవత్సరంలో కరీనా నటించడం ఆమెకు తప్పక వింత అనుభూతే. కాగా 2009 క్రిస్మస్
కానుకగా విడుదలైన ‘3 ఇడియట్స్’ సుమారు 300 కోట్ల రూపాయలను, గతేడాది దీపావళికి
విడుదలైన ‘గోలీమార్ 3’ చిత్రం సుమారు 110 కోట్ల రూపాయిలను ఏ విధంగానైతే వసూలు
చేశాయో అలాగే తనకచ్చొచ్చిన పండగ సీజన్ లో భాగంగా విడుదల కానున్న ‘రా.వన్, ఏజెంట్
వినోద్’ చిత్రాలు కూడా అదే విధంగా భారీ వసూళ్ళ చిత్రాలు అవుతాయన్న ఆశాభావాన్ని కరీనా
వ్యక్తం చేస్తోంది. ఇదిలా వుండగా ‘దోస్తానా-2’లో అభిషేక్ బచ్చన్ సరసన ఎంపికయ్యినట్లు
వార్తలు వినిపిస్తున్నాయి.
|