Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
బికినీకి ‘నో‌’

      ‘భూమ్‌’, ‘న్యూయార్క్‌’ వంటి చిత్రాల్లో బికిని ధరించి కనిపించిన కత్రీనాకైఫ్‌ ఇక మీదట బికిని ధరించనని తెగేసి చెప్పేసింది. అంతేకాదు ముద్దు సీన్లకు సైతం గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. వల్గారిటీ ఉన్న పాత్రలను ఇక మీదట చేయనని కత్రీనా ప్రటించింది. బికిని ధరిస్తే తనకు కంపర్టబుల్‌గా ఉండడం లేదని అందుకే ఇక మీద బికిని ధరించరాదని నిర్ణయించుకున్నట్లు కత్రీనా తెలిపింది. ప్రస్తుతం వస్తున్న దోస్తానా-2 చిత్రంలో కూడా బికిని ధరించనని నిర్మాత కరన్‌జోహర్‌, దర్శకుడు తరుణ్‌ మనసుకానిలకు ముందే చెప్పిందట.

ఈ విషయాన్ని కత్రీనా స్నేహితురాలు ఒకరు దృవీకరించారు.‘కత్రినా ఇక మీదట ముద్దు సీన్లలోనూ, బికిని ధరించిగాని నటించనని చెప్పింది. ఈ విషయాన్ని దర్శకులకు కూడా చెప్పింది. కత్రీనా నటించిన అనేక చిత్రాల్లో ముద్దు సీన్లు పెట్టారు. అయితే కొన్ని సన్నివేశాలు పలుసార్లు వివాదస్పదమయ్యాయి. అంతేకాక దోస్తానా-2లో బికిని ధరించిన సన్నివేశాలపై కూడా దుమారం రేగింది. గత దోస్తానా చిత్రంలో ప్రియాంకచోప్రా నటించగా, దోస్తానా -2లో కత్రీనాకు అవకాశం వచ్చింది. తను ఇక మీదట ఎక్స్‌ఫోజింగ్‌ చేయనని, ముద్దు సీన్లలో నటించనని నిర్మాతలకు ముందుగానే చెప్పేస్తుందట.

‘నేను ఇక మీదట అసభ్యకరమైన దృశ్యా లలో నటించకూడదదని నిర్ణయించుకున్నాను. అవి నాకు కంపర్టబుల్‌గా ఉండడం లేదు. బికినిలో నటించడం, ముద్దుసీన్లలో నటించడం నేను ఇబ్బందిగా ఫీలవుతు న్నాను. అందుకే ఇక మీదట అలాంటి దృశ్యాలలో కనిపించకూడదని నిర్ణయించుకున్నాను’ అని కత్రీనా తెలిపింది. నా అభిమానులు సైతం ఇలాంటి దృశ్యాలలో నటించవద్దని కోరుతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని కత్రీనా తెలిపింది. కత్రీనా నిర్ణయంతో అభిమానులు సంతోషిస్తారో లేదో తెలియదు కానీ నిర్మాతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారట.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005