వ్యక్తిగతంగా నన్ను నేను హాట్ అనీ, సెక్సీ అనీ అనుకోను. చూసే కళ్లను బట్టి రూపం ప్రత్యేకంగా
కనిపిస్తుందంతే. ప్రేక్షకులనుకున్నంత హాట్ మాత్రం కాదు. సంప్రదాయబద్దమైన పాత్రలు
విద్యాబాలన్ కు బాగా నప్పుతాయి. ఆమెను ప్రేక్షకులు అలా చూడడానికి ఇష్టపడతారు. నా వరకూ
వస్తే... ఫన్నీగా ఉండే పాత్రలే కుదురుతాయి. నాకు సౌకర్యం కూడా అవే. అందుకే అలాంటివి
చేస్తున్నా. చూపుల్ని బట్టి ట్యాగ్ లొద్దు. నన్ను హాట్, సెక్సీ అనకండి ప్లీజ్ - అని అంటోంది కత్రీనా.
తొలిసారి ‘రాజ్ నీతి’లో డీగ్లామరస్ పాత్రలో కనిపించారు..?
రాజకీయ నాయకురాలి పాత్రలో నటించా. అందుకే మేకప్ లేకుండా సహజంగా కనిపించా. దర్శక
నిర్మాత ప్రకాష్ ఝా చెప్పినట్టే చేశా.
ప్రారంభానికి ఇప్పటికీ మధ్య మీ అవకాశాలకి కారణం మీరు కనిపించే తీరు, లుక్సేనేమో?
14 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చా. యుక్త వయసులో గ్లామర్ పరిశ్రమలోకి ప్రవేశించా. లుక్స్ (అందం)
విషయంలో చాలా నేర్చుకున్నా. నటనకి అదొక్కటే సరిపోదని అప్పుడే ఊహించా.
చాలా మంది బాలీవుడ్ తారలు యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. మీరెప్పుడు చేస్తారు?
వైవిధ్యమైన పాత్రలు పోషించడం ఇష్టమే. ‘చార్లీ యాంజెల్స్’ తరహా యాక్షన్ సినిమా
చెయ్యాలనుంది. మరీ విమానం రెక్కల్లోంచి దూకేసే లాంటి పాత్రలయితే చెయ్యను కానీ జనం
నానుంచి ఎలాంటి యాక్షన్ ఇష్టపడతారో అలాంటి వాటికి ఒకే. గాలిలో తేలేకంటే నేలపై నిలిచే
సినిమాల్లో చెయడమే ఎక్కువ ఇష్టం. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల్లో చేయడం అన్నా ఆసక్తి.
బాక్సాఫీస్ వసూళ్లరాణిలా మిమ్మల్ని చూస్తారు. అన్ని (మీ) సినిమాలు ఎలా హిట్ అయ్యాయి?!
అనుకోకుండా కొన్ని కలిసొస్తాయి. నన్నేదో రహస్య శక్తి నడిపిస్తోంది. చెత్త సినిమాలు చేయకుండా
అది ఆపుతోంది. నేను వదులుకున్నవి, చెయ్యాలనుకుని కుదరనివి... అంతా నా మంచికే
జరిగాయి. వాటి విషయంలో తెలియకుండా ఏదో జరిగింది.
రణభీర్ మినహా మీతో నటించిన హీరోలంతా ఏజ్ బార్ అనుకుంటా?
నిస్సంకోచంగా! ఆ విషయంలో చాలాసార్లు వారిని ఏడిపించా. అప్పుడు వాళ్లంతా ‘నన్ను చూడు
ఇదే వయసులోని వేరే వాళ్లని చూడు. నీకే తేడా తెలుస్తుంది.’ అని పోల్చారు. ఖచ్చితంగా వాళ్లని
మెచ్చుకుని తీరాలి. అలా కనిపించడం అంత సులువు కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అమీర్
ఖాన్, షారుఖ్.. గ్రేట్
ఏం లేకపోతే మీకస్సలు తోచదు?
జపనీస్ ఫుడ్, నిద్ర, బీచ్ లు,.. అలాగే సినిమాలు. అవే నా ఫ్యాషన్.
బాలీవుడ్ కొచ్చి ఏడేళ్లయింది కదా...ఏమనిపిస్తోంది?
బతుకు, బతకనివ్వు! అది నా సుదీర్ఘ పయనంలో పాటించిన సిద్ధాంతం. సంతోషంగా ఉండాలంటే
ప్రేమించాలి. ప్రేమించబడాలి. రెండూ నాకున్నాయి. అంతే.
|