|
కత్రినాకైఫ్ మోజులో పడినందునే, కెరీర్ ప్రారంభం నుంచి తనకు తగిన ప్రచారం లభించేందుకు ఉపకరించడంతోపాటు, తన తల్లిదండ్రుల ఆదరాభిమానాలు సైతం గెలుచుకున్న దీపికాపదుకునేకు రణబీర్‌కపూర్ గుడ్‌బై చెప్పాడంటూ ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది.
సల్మాన్‌ఖాన్ ప్రియురాలిగా పరిశ్రమకు పరిచయమయిన కత్రినా ఆ తర్వాత తనదైన శైలిలో ‘పావులను’(హీరోలను) కదుపుతూ అంచెలంచెలుగా అగ్ర కథానాయిక స్థానాన్ని కైవసం చేసుకుంది. సల్మాన్‌తో కత్రినా ‘సహజీవనం’.. అతనితో కలిసి ఆమె నటించిన ‘మైనే ప్యార్ క్యోం కియా?’ (నేనెందుకు ప్రేమించాను?) ‘యువరాజ్’ చిత్రాలకు బ్రహ్మాండమైన ప్రచారం తెచ్చిపెడితే, ఆ తర్వాత అక్షయ్‌కుమార్ మనసు దోచుకుని(?) అతనితో వరుసగా మూడు సినిమాలు చేయడం కత్రినా కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది.
అక్షయ్‌తో ఈ అందాలభామ నటించిన ‘నమస్తే లండన్’, ‘వెల్‌కమ్’, ‘సింగ్ ఈజ్ కింగ్’ చిత్రాలు ఘన విజయం సాధించి ఈమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టాయి. అలాగే ఈ బుల్లి జాన్ అబ్రహాంతో నటించింది ‘న్యూయార్క్’ అనే ఒకే ఒక చిత్రం అయినప్పటికీ.. ఆ చిత్రం అనూహ్యరీతిలో అసాధారణ విజయం సాధించి కత్రినా క్రేజ్‌ను ఇబ్బడిముబ్బడిగా పెంచేసింది. అంతేకాదు, ఈ చిత్ర నిర్మాణ సమయంలో కత్రినా-జాన్ అబ్రహాంల మధ్య నడిచిన ‘ప్రేమ వ్యవహారం’ బిపాషాబసు గుండెల్లో తీవ్రస్థాయిలో గుబులు పుట్టించింది.
ఒక దశలో కత్రినా కోసం బిపాషాకు జాన్ అబ్రహాం ‘బై బై’ చెప్పేయనున్నాడంటూ కూడా పుకార్లు పుట్టుకొచ్చాయ్. ఈ ముగ్గురు కాకుండా.. కత్రినా ‘కథ’ నడుపుతోందంటూ తాజాగా వెలుగులోకొచ్చిన పేరు రణబీర్ కపూర్‌ది. ‘అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహాని’ చిత్రంలో జంటగా నటించిన వీరివురూ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘హల్‌చల్’ సృష్టిస్తున్నారు. కత్రినా కోసం రణబీర్ నిర్మాతగా మారుతున్నాడని సైతం వార్తలు షికారు చేస్తున్నాయి.
తొలుత సినిమా ప్రచారం కోసమే వీరిద్దరి మధ్యా ‘ఏదో ఉంది’ అని ప్రచారం చేస్తున్నారని కొంతమంది చేసిన వాదనలను కొట్టిపారేస్తూ రణబీర్-దీపికలు విడిపోవడం వీరి ‘ఎఫైర్’కు మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇక్కడ గమనార్హమైన విషయమేమిటంటె, సల్మాన్ తర్వాత మరో ముగ్గురుతో కత్రినా ‘కథ’ నడిపినా(నడుపుతున్నా) కూడా సల్మాన్‌తో కత్రినా సంబంధాలు పెద్దగా పాడవ్వకపోవడం!
|