అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురూ ముగ్గురే. బాలీవుడ్‌లో వీరిదే హవా. అంతేగాక దేశవిదేశాల్లో ఈ ఖాన్‌ల త్రయానికి లెక్కలకు సైతం అందని రీతిలో ఎందరో అభిమా నులున్నారు. మరి ఈ ముగ్గురు హీరోలు పోటీ పడితే నెంబర్ నంబర్ వన్ స్థానం దక్కించు కునేదెవరు..? ఈ ప్రశ్నకు ఇటీవల సమా ధానం లభించింది.
మూడు నెలలుగా ఖాన్ హీరోల త్రయం మధ్య నంబర్ వన్ స్థానం కోసం ఉత్కంఠమైన పోరు సాగింది. తిరుగులేని అగ్ర శ్రేణి హీరోలుగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఖాన్‌ల సినిమాలు వరుసగా బాక్సాఫీసు ముందు తలపడ్డాయి. దీంతో బాక్సీఫీసు కలెక్షన్లను అనుసరించి నెంబర్ వన్ హీరో ఎవరు అనే అంశంపై బాలీవుడ్ జోరుగా చర్చలు సాగుతున్నాయి. వీరిలో అమీర్ ఖాన్ నటించిన ‘త్రీ ఇడియట్స్’ సినిమా ముందుగా రిలీజైంది. కొద్ది రోజుల వ్యవథిలోనే సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్’ సినిమా ప్రేక్షకుల ముందు వాలింది. ఇక బాలీవుడ్ బాద్ షా నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ కూడా బాక్సాఫీసు రేస్‌లో నిలిచింది. కేవలం మూడు నెలల వ్యవధిలో ముగ్గురు ఖాన్‌ల సినిమాలు బాక్సాఫీసు వద్ద తలపడ్డా యి. సల్మాన్ నటించిన ‘వీర్’ సినిమా అభిమానులను సైతం నిరాశపరచింది. దీంతో రేస్ నుంచి ఆ సినిమా వెంటనే వైదొలగింది. ఈ మూడు సినిమాల కథాంశం దేనికదే విభిన్నంగా ఉంటుంది. కానీ రిలీజ్‌కు ముందు వివాదాలతో ఉచిత ప్రచారం పొందడంలో మూడు సినిమాల పంధా ఒక్కటే. ‘వీర్’ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తా కొట్టడంతో అమీర్, షారుఖ్‌లే రేస్‌లో నిలిచారు. దీంతో మిగిలిన ‘త్రీ ఇడియట్స్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ బాక్సీఫీసు బాహా బాహీ తమాషా చూపించాయి. షారుఖ్ నటించిన ‘మైనేమ్ ఈజ్ ఖాన్’కు ఓపెనింగ్‌లో కలెక్షన్లు వెల్లువెత్తినా రెండో వారం నాటికి ఆదరణ తగ్గింది. దీంతో కలెక్షన్‌లు తగ్గి బాద్ షా రేస్‌లో కాస్త వెనుక బడినట్లు బాలీవుడ్ వర్గాలు అంచనా వేసాయి.
ఇక ‘త్రీ ఇడియట్స్’ సూపర్ హీరోగా కలెక్షన్ల జోరును కొనసాగిస్తుండటంతో అమీర్ ఖాన్ నంబర్ వన్ హీరోగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాల పోరును ముందే ఊహించిన బాద్ షా ముం దే వ్యూహం సిద్ధం చేసారని బాలీవుడ్ గుసగుస లాడుతోంది. అమీర్ నటించిన ‘త్రీ ఇడియట్స్’ సూపర్ సక్సెస్‌ను అడ్డుకొని తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు యత్నించారని, అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్‌కు యజమానిగా ఉన్న షారుఖ్ కావాలనే పాక్ క్రికెటర్లపై వ్యాఖ్యలు చేసి శివసేన వివాదాన్ని కొనితెచ్చుకున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి ఖాన్‌ల త్రయంలో నంబర్ వన్ ఎవరైనప్పటికీ బాక్సాఫీసు కలెక్షన్‌లలో నెంబర్ వన్ మాత్రం అమీర్‌ఖానేనని తేలింది. కానీ మళ్ళీ కథలో ట్విస్ట్ వచ్చింది. స్వదేశంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినట్టు కనిపించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ అంతర్జాతీయంగా మాత్రం సంచలనాలే సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ ఆ చిత్రం అంతర్జాతీయంగా సాధించిన కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది.
|