షర్మిలా ఠాగూర్ కుటుంబ విషయాల్లో ఏమాత్రం దాపరికాలు వుండవనే సంగతి తెలిసిందే. ఆ ఇంట్లో వాళ్ళంతా అంతే. ఏదీ దాచుకోరు. అన్ని విషయాలూ బయటపెట్టేస్తుంటారు. సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ మధ్య బంధం గురించి తెలియనివారుండరు. బాలీవుడ్లో లైట్ బాయ్ ని అడిగినా గడగడ చెప్పేస్తాడు. ఇప్పుడు వాళ్ళింట్లో మరో అమ్మాయి ప్రేమలో పడంది. ఆమే సోహా అలీఖాన్. అంటే గతంలో పడలేదా?... అంటే ఆ సంగతి అడగొద్దు. ‘రంగ్ దే బసంతీ’ చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు సిద్ధార్థతో పరిచయం ప్రేమగా మారిందని చెప్పుకున్నారు. ప్రస్తుతం సోహా మరోసారి మనసు ఇచ్చేసింది. కునాల్ ఖేముతో ఆమె బంధం బలపడినట్లు సమాచారం. ‘కునాల్ తో మాట్లాడుతున్నంత సేపూ చాలా సరదాగా వుంటుంది. అదీకాక మా ఇద్దరికి తగాదాలు కూడా ఎక్కువే. ఎలాంటి సమయాల్లోనైనా చాలా కూల్ గా వుంటాడు. సమస్యలొస్తే పరిష్కరించడంలో దిట్ట. మా ఇద్దరి విషయం ఇంట్లోవాళ్ళకి తెలిసింది. వారు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. కునాల్ మా తల్లిదండ్రులతో మాట్లాడారు. కునాల్ ప్రవర్తనను ఇంట్లో వాళ్ళు గమనించారు. తర్వాత పెళ్ళిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పుడనేది త్వరలోనే తెలుస్తుంది’ అని తెగ సిగ్గుపడిపోయింది సోహా.
|