హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో లీయోనార్డో డై క్యాప్రియె ఈయన గత ఏడాది నెం.5వ స్థానం నుంచి నెంబర్ వన్ స్థానానికి ఎగబాకారు. 2010 క్యాప్రియాకు బాగా కలిసి వచ్చిన సంవత్సరంగాగా చెప్పుకోవచ్చు. ఆయన సినిమాకు తీసుకునే పారితోషికం 77 మిలియన్ డాలర్లు ( భారతీయ కరెన్సీ ప్రకారం రూ.346 కోట్లు )
లీయోనార్డియో డై క్యాప్రియా హాలీవుడ్ నటుడు.. నవంబర్ 11, 1974లో లాస్ ఏంజి లెస్‌లో జన్మించాడు. ఆయన
ఖాతాలో ఇప్పటి వరకు పలు అవార్డులు, రివార్డులు ఉన్నాయి. 2004లో విడుదలైన ఏవియేటర్ చిత్రానికి ఆయనకు
గోల్డెన్‌గ్లోబ్ అవార్డు కూడా దక్కించుకున్నాడు.ప్రారంభంలో టెలి విజన్ వాణిజ్య ప్రకటనల్లో తన కేరీర్‌ను ప్రారంభిం చాడు.
తర్వాత తిన్నగా టెలివిజన్ సీరియర్లలో నటించడం మొదలుపెట్టాడు. ఆయన నటించిన టీవీ సీరియల్ శాంటా బార్బరా
పెద్ద హిట్. ఆ సీరియళ్లు చూసిన చాలా మందికి ఈ విషయం గుర్తుండే ఉంటుంది.
సినిమాల విషయానికి వస్తే సైన్స్ - ఫిక్సన్ హారర్ చిత్రంతో ఆయన తెరగేట్రం మొదలు పెట్టారు. ఆయనకు అంతర్జా
తీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చింది మాత్రం జేమ్స్ కెమరాన్ చిత్రం టైటానిక్ (1997)లో విడుద లైంది. ఈ చిత్రం ప్రపంచ
వ్యాప్తంగా వసూళ్లు రికార్డు బద్దలు కొట్టింది. 351.1 మిలియన్ డాలర్లు వసూలు తెచ్చి పెట్టింది. భారతీయ కరెన్సీ ప్రకారం
రూ.1600 కోట్ల వరకు రెవె న్యూను సాధించి పెట్టింది. హాలీవుడ్ సినిమా చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు.
2000 సంవత్సరం నంచి ఆయన చిత్రాలు అవార్డుకు నామినెట్ అయినవి : క్యాచ్ మీ ఇప్ యూ కేన్ (2002), గ్యాంగ్స్ ఆఫ్ న్యూ యార్కు (2002), ది ఏవియేటర్ (2004), బ్లడ్ డైమండ్ (2006), ది డిపార్టెడ్ (2006), ది రెవెల్యూషనరీ రోడ్ (2008)
కాగా ఆయన తాజా చిత్రం షట్టర్ ఐలాండ్ (2010), దానితోపాటు ఇన్‌సెప్సన్ (2010). ఈ చిత్రాలు కమర్షియల్‌గా బాగా
విజయవంతమైనాయి. ఆయనకు డబ్బుకు డబ్బు, పేరుకు పేరు సంపాదించిపెట్టాయి. డి క్యాప్రియో సొంతంగా ఒక
ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రారంభించాడు దాని పేరు ఆపియన్ వే ప్రొడక్షన్ దీని ద్వారా గార్డెన్ ఆఫ్ ఈడెన్ (2007), ఆర్పన్
(2009)లో నిర్మించాడు.
ఇక సామా జిక విషయానికి వస్తే ఆయన పర్యావరణం కోసం బాగా కృషి చేసారని పర్యావరణ నిపుణుల నుంచి
మంచి ప్రశంసలు దక్కించుకున్నారు. నవంబర్ 2010లో డిక్యాప్రి యో వన్యప్రాణులను రక్షిం చే సంస్థ రష్యాలో ఏర్పాటు
చేసిన శిఖరాగ్ర సమా వేశానికి హాజరయి 10 లక్షల డాలర్లను (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.5 కోట్లు) విరాళంగా ఇచ్చారు.
ఆయన ను రష్యా ప్రధానమంత్రి వ్లాదామిర్ పుతిన్ రియల్‌మన్ అంటూ ప్రశంచారు. 2010లో హైతీ భూకంపం వచ్చి ఆ
దేశం మొత్తం నేల మట్టమైన విషయం తెలిసిందే.
ఆ సమయంలో క్యాప్రియో హైతీ వెళ్లి అక్కడి ప్రజ లను ఒదార్చారు. వారికి సేవ లందించి రూ.4.5 కోట్లను విరాళం ఇచ్చి వచ్చారు. వ్యక్తిగత జీవితానికి వస్తే పలు వురితో ఏఫైర్స్ నడుపుతూ పత్రికల్లో ఎప్పుడూ నాను తూ ఉంటారు. ఆయన ప్రేమ వ్యవహారాలు బ్రిటన్‌తో పాటు అమెరికా పత్రికల్లో కూడా మంచి కవరేజి ఇచ్చాయి. బ్రెజిల్ మోడల్ గైసెలే బన్‌డ్చెన్‌తో పాటు ఇజ్రేల్‌కు చెందిన మోడల్ బార్ రేపాల్‌తో ఆయన జరిపిన ప్రేమాయణం గురించి పత్రికల్లో ప్రముఖంగా అచ్చయింది.