Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ఆఖరి దశలోనూ ఆశతో.... లీసా రే

     తమిళ చిత్రం 'నేతాజి'తో సినిమా రంగంలోకి ప్రవేశించిన లిసా రే ... ఆ సినిమాలో శరత్‌ కుమార్‌కు జంటగా నటించింది. తరువాత అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో మొదటి చిత్రం కసూర్‌. ఇది 2001లో వచ్చింది.బాలీవుడ్‌లో ప్రవేశించినప్పుడు లిసా రేకు హిందీ రాదు. తనకు దివ్వదత్తా డబ్బింగ్‌ చెప్పేది.ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగా దీపీ మెహాత కళ్ల పడింది లీసా రే. బాలీవుడ్‌/హాలీవుడ ఇన్‌ 2002 చిత్రానికి నటించేందుకు అవకాశం వచ్చింది. మరలా దీపా మెహాతా, లీసారే కలిసి ఆస్కార్‌కు ఎన్నికైన చిత్రం ‘వాటర్‌’ కోసం పనిచేశా రు. ఈ చిత్రంలో లిసారే తనకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. ఇలా పలు విభిన్న మైన పాత్రలు కలిగిన పది చిత్రాలకు పైగా నటించింది. తెలుగులో 'టక్కరి దొంగ' సినిమాలో మహేష్‌బాబు కు జంటగా నటించింది. ‘అఫ్రీన్‌ అఫ్రీన్‌’ పాట లిసారేకు మంచి పేరును తీసుకొచ్చింది. హెలో మ్యాగజైన్‌ వెల్లడించిన ‘50 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ పీపుల్‌’ జాబితాలో చోటు సంపాదించుకుంది.

ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌ పావులో జంబాల్డీతో ఎక్కువ కాలం కలిసి జీవించింది.

ఇలా చిత్రాల్లో, మోడలింగ్‌లో దూసుకుపోతున్న లిసా రేకి మల్టిపుల్‌ మైలోమా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు జూన్‌ 23న గుర్తిం చారు. అప్పుడు లీసారే అధైర్య పడుకుండా సవాల్‌గా తీసుకుని ఈ ఏడాది జులై 2 నుంచి చి ిత్సను ప్రారంభించింది. ఈ క్యాన్సర్‌పై పలు డాక్యుమెంటరీలను లిసా రే విడుదల చేశారు.

లిసారేకి చాలా ధైర్యం. ఎందుకంటారా? అద్భుతమైన అందం ఉండి అలరించే పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నా, ఎవరూ సాహసించని లెస్బియన్‌ పాత్రలో అందునా వితంతువుగా ఓ డీగ్లామర్‌ రోల్‌లో నటించింది.

డబ్బుకంటే అభిరుచికి, పాత్ర ఔచిత్యానికే ప్రాధాన్యం అంటుందామె. ఇండో కెనడియన్లకిచ్చే ప్రతిష్ఠాత్మక ‘ఓయస్‌ అచీవర్స్‌ అవార్డ్‌ ఫర్‌ 2009’ను పొందిన ఏడుగురిలో లిసా రే ఒకరు.

అరుదుగా వచ్చే క్యాన్సర్‌ బారిన పడ్డానని తెలిశాక లిసా కుంగిపోలేదు. ఆరోగ్యం పొందడానికి సన్నద్ధురాలైంది. బ్లడ్‌ క్యాన్సర్‌ మరణాలు అధికంగా ఉండే కెనడాలో, మల్టిపుల్‌ మైలోనూ సభ్యులకోసం ప్రత్యేకంగా నిర్వహించే ఓ క్లబ్‌లో సభ్యురాలిగా చేరింది. ఈ వ్యాధితో బాధపడే వారికి... ఎప్పటి కప్పుడు నివారణ దిశగా పడుతున్న అడుగుల్ని, పరిశో దన వివరాలను ఒక బ్లాగ్‌ ద్వారా అందించేందుకు నడుం కట్టింది.

విరుచుకుపడిన వ్యాధితో తలపడానికి లిసా రే అన్ని విధాల ప్రయత్నిస్తోంది. ‘కీమోథెరపీ భరించడం అంటే మాటలా! అందుకే ఏ నిమిషంలోనూ డీలా పడిపోకుండా ఉండేందుకు రోజూ యోగా సాధన చేస్తున్నా, సాధారణంగా క్యాన్సర్‌ బాధిత మహిళలు కీమోథెరపీతో శిరోజాలను కోల్పోతుంటారు. అంతకంటే ఎక్కువగా వారి మానసిక స్థైర్యం సన్నగిల్లుతుంది. అందుకే ‘లుక్‌ గుడ్‌ ఫీల్‌ బెటర్‌’ పేరుతో వర్క్‌ షాపులను నిర్వహిస్తున్నానని చెప్పింది లిసా రే.

మల్టిపుల్‌ మైలోమాకి మందు లేదు... అయితేనేం ఆశ కోల్పోవడం ఎందుకంటోంది లిసా. ‘ఆశల పయనం కొనసాగించండి. మందులు లేకపో యినా, జీవిత కాలాన్ని పొడిగించుకునే పద్ధతులు న్నాయి. భవిష్యత్తులో మందులు వచ్చే అవకాశా లున్నాయి. అంతవరకూ అనందంగా జీవించ డానికి ప్రయత్నించాల్సిందే’ అంటోంది లిసా రే.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005