Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
క్యాన్సర్ బాధితులకోసం లీసారే ట్రస్ట్

      బాలీవుడ్ నటి లీసారే క్యాన్సర్ బారిన పడి ఆ మహమ్మారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.

క్యాన్సర్ బారిన పడ్డం ఎంత ప్రమాదకరమో, అదెంత బాధాకరమైన వ్యాధో తనకు ప్రత్యక్షంగా తెలిసినందువలన ఇకపై క్యాన్సర్ బాధితుల కోసం తనవంతు సహాయం చేస్తానని అంటుంది.

క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడ్తాననీ, ఒక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది.

ఐదు కోట్ల రూపాయలు క్యాన్సర్ బాధితుల కోసం ఒక నిధిగా ఏర్పాటు చేస్తానని, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని, ఆ ఫండ్ ద్వారా క్యాన్సర్ బాధితులకు చికిత్స ఖర్చులు భరించేలా ప్లాన్ చేస్తున్నానని లీసారే చెబుతోంది.

2011 సంవత్సరం ప్రారంభంలో తన పేరిట ఒక ట్రస్ట్ ప్రారంభిస్తానని, అప్పటి నుంచీ ఆ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు, ప్రధానంగా కాన్సర్ బాధితులకు సహాయంగా వుండే కార్యక్రమాలు చేపడ్తానని లీసారే ప్రకటించింది.

ఇకపై సినిమాల ద్వారా, మోడలింగ్ ద్వారా తాను సంపాదించే సొమ్ములో కొంత భాగం క్యాన్సర్ బాధితులకోసం ఉపయోగిస్తానని తెలిపింది.

క్యాన్సర్ మహమ్మారి ఆవరించినా, దాన్ని జయించిన లీసారే ఇలా సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అందరూ హర్షిస్తున్నారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005