మసాలా
 
 
 
 
కొత్త జీవితాన్ని ప్రారంభించిన లిసారే
వైట్‌ బ్లడ్‌ సెల్స్‌ క్యాన్సర్‌, మల్టిపుల్‌ మైలొమా వ్యాధులతో బాధ పడి చికిత్సలు చేయించుకున్న తర్వాత వాటి నుంచి పూర్తిగా విముక్తిరాలయ్యారు అందాల తార, మోడల్‌ లిసారే. ఈ వ్యాధులు నయమైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కొత్త ఉత్సాహంతో మళ్లీ కెమెరాల ముందుకు వస్తున్నారు. వివిధ వ్యాధులతో బాధపడి చికిత్సలతో వాటి నుంచి దూరమైన తనకు ఇప్పుడు పునర్జన్మ అని అన్నారు లిసారే.

2009 సంవత్సరంలో ‘కుకింగ్‌ విత్‌ స్టెల్లా’ చిత్రం తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆమె కెమెరాల ముందు కనిపించలేదు. వివిధ రకాల వ్యాధులతో బాధపడ్డ ఆమె దాదాపు రెండు సంవత్సరాల వరకు వైద్య చికిత్సలతో ఆస్పత్రిలోనే ఉండిపోయారు. చివరికి ఆ వ్యాధుల నుంచి విముక్తిరాలై కొత్త జీవితాన్ని ప్రారంభించారు లిసారే. ఈ నేపథ్యంలో లిసా తండ్రి తన కూతురును లిసా రాణి రే అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. వివిధ వ్యాధుల నుంచి బయటపడ్డ తన కుమార్తె పేరు మధ్యలో రాణి అనే పదాన్ని కొత్తగా ఆయన చేర్చారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన లిసారే ట్రావెల్‌, లివింగ్‌ ఛానెల్‌ టిఎల్‌సి కోసం ‘ఓహ్‌ మై గోల్డ్‌!’ అనే షోకు హోస్ట్‌గా చేస్తున్నారు. దీంతో పాటు ఓ జ్యూయలరీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సైతం పనిచేస్తున్నారు. ‘వివిధ వ్యాధులతో చికిత్సపొందు తూ దాదాపు రెండు సంవత్సరాల వరకు బయటి ప్రపంచానికి దూర మయ్యాను. ఈ వ్యాధులు పూర్తిగా నయమవడంతో ఎంతో ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాను. పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నా అప్పటి శక్తి, హుషారు రావాలంటే కొంత సమయం పడుతుంది. నా కొత్త జీవితాన్ని ఆనందమయంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నా స్నేహితులు నన్ను బాగా ప్రోత్సిహ స్త్తున్నారు.’ అని లిసారే చెప్పారు.