ఆరోగ్యకరమైన పోటీని ఆహ్వానించడానికి తానెప్పుడూ సిద్ధమేనంటున్నారు నటుడు మాధవన్. అమ్మాయిల వశీకరణ
నటుడిగా గుర్తింపు పొందిన ఈ క్రేజీ నటుడు దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ మంచి నటుడిగా
వెలుగొందుతున్నారు. కోలీవుడ్‌లో 'రన్' చిత్రంతో పునాది వేసుకున్న మాధవన్ నటుడిగా దశాబ్ద కాలాన్ని పూర్తి
చేసుకున్నారు.
వేట్టై' చిత్రం లో నటించిన అనుభవం గురించి చెబుతారా?
లింగుస్వామి దర్శకత్వంలో 'రన్' చిత్రంలో నటించాను. ఆ చిత్రమే నా చాక్లెట్‌బాయ్ ఇమేజ్‌ను మార్చి,
తమిళ ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశాను. హిందీలో' 3
ఇడియట్స్' మొదలగు చిత్రాలు చేశాను. కొంచెం గ్యాప్ తరువాత కమలహాసన్‌తో కలసి' మన్మథన్ అంబు' చిత్రంలో
నటించాను. హిందీ చిత్ర షూటింగ్‌లో గాయపడి, విశ్రాంతి పొందుతున్న సమయంలో లింగుస్వామి 'వేట్టై 'చిత్ర కథను
నా కోసమే తయారు చేశానని చెప్పారు. అందులో నటించాలనే నిర్ణయానికి కొచ్చాను.
మీకు హిందీలో నటించిన త్రీ ఇడియట్స్ చిత్రం, శంకర్ దర్శకత్వంలో నన్బన్ పేరుతో రూపొందిన వేట్టై చిత్రానికి
పోటీగా విడుదలవడం గురించి మీ కామెంట్?
జవాబు : త్రీ ఇడియట్స్ చిత్రం విద్యార్థుల ఇతివృత్తంతో రూపొందింది. అది శంకర్ దర్శకత్వంలో నన్బన్‌గా రీమేక్
కావడం సంతోషకరమైన విషయమే. ఇక ఆరోగ్యకరమైన పోటీని ఆహ్వానించడానికి నేనెప్పుడూ సిద్ధమే.
కమల్, సూర్య వంటి హీరోలతో కలసి నటించారు. ఇప్పుడు వేట్టైలో ఆర్యతో కలసి నటించిన అనుభవం?
నిజం చెప్పాలంటే నేను వేట్టై చిత్రాన్ని అంగీకరించినప్పుడు ఆర్యతో కలసి నటిస్తానని తెలియదు. అప్పుడు
పరిస్థితి వేరు. అయినా నేను ఇతర హీరోలతో కలసి నటించేటప్పుడు పాత్ర మినహా ఏ విషయం గురించి ఆలోచించను.
వేట్టై చిత్రంలో ఆర్య, నేను సహోదరులుగా నటించాం. ఆర్య ఏ విషయాని అయినా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి.
కఠిన శ్రమజీవి. స్నేహశీలి.
నూతన దర్శకుల చిత్రాల్లో నటించడానికి నిరాకరిస్తున్నారని అంటున్నారు.
జవాబు: అవన్నీ నిరాధార ఆరోపణలే. పెద్ద దర్శకులు, చిన్న దర్శకులు అనే దృష్టితో నేనెప్పుడూ చూడలేదు. కథ
నచ్చితే ఏ దర్శకుడితోనైనా కలసి చేయడానికి సిద్ధమే