ఒకప్పటి బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ నేడు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా మారారు. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలి
చిన ఈ తార ప్రస్తుతం అమెరికాలో ఓ పెద్ద షాపింగ్ మాల్‌ను కొనుగోలు చేయడం విశేషం. ఆమె యుఎస్‌లోని ఫ్లోరిడాలో మిలియన్ల
డాలర్ల విలువ చేసే షాపింగ్ మాల్‌ను కొనుగోలుచేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
సినీ తార మాధురీ దీక్షిత్ వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడిన విష యం అందరికీ తెలిసిందే. అక్కడ కొంతకాలం
కుటుంబంతో హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమె దృష్టి వ్యాపారంపై పడింది. ఆమె అమెరికా లోని డెన్వర్‌లో
నివసిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం ఆమె ఫ్లోరిడాలోని మియా మిలో ఓ పెద్ద షాపింగ్ మాల్‌ను కొనుగోలుచేశారు. మియామి ప్రాంతం
షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు హాటెస్ట్ ప్రాంతంగా పేరుగాంచింది. పర్యాట కులు తప్పనిసరిగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ షాపింగ్
చేయడంతో పాటు వినోద కేంద్రాలకు వెళ్లి హాయిగా గడుపుతారు.
దీంతో మాధురీ మియామి ప్రాంతంలో షాపింగ్ మాల్‌ను కొనుగోలుచేసి దాన్ని వ్యాపార,వాణిజ్య కేం ద్రంగా వినోద ప్రాంతంగా
తీర్చిదిద్దుతున్నారు. షాపింగ్ మాల్ కొనుగోలుకు ఆమె బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో రుణాన్ని తీసుకున్నారు. మియామి వంటి
ప్రాంతంలో షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కేంద్రానికి అనువైన మాల్‌కు బ్యాంక్ వెంటనే రుణాన్ని మంజూరుచేసింది. ఇక మాధురీ దీక్షిత్
పిల్లలు పెద్ద వారవుతున్నారు. దీంతో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఔత్సాహిక పారిశ్రామి కవేత్తగా తనను తాను నిరూపించుకోవాలని
ఆమె మాల్‌ను కొనుగోలుచేశా రు. మాధురీ దీక్షిత్ పెద్ద మొత్తంలో రుణాన్ని తీసుకోవడం అందర్నీ ఆలోచిం పచేసింది. అంత
మొత్తాన్ని ఆమె ఎలా తిరిగి చెల్లిస్తుందని వారు భావిస్తున్నారు.
కానీ మాధురీ ఇదివరకే కొన్ని టివి రియాల్టీ షోలకు సైన్ చేసింది. దీని ద్వారా ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్టు
సమాచారం. దీంతో మళ్లీ బాలీవుడ్‌లోకి ప్రవేశించి సినిమాలు చేయాలని ఆమె భావిస్తున్నారు. దీంతో వచ్చే డబ్బును బ్యాంక్
రుణాన్ని చెల్లించాలని ఆమె ఆలోచన. భర్త డాక్టర్ శ్రీరామ్ నేని మాధురీని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు
ఆయనే ప్రధాన సలహాదారునిగా ఉంటు న్నారు. కానీ మాధురీ దీక్షిత్ బిజినెస్ మేనేజర్ రిక్కూ రాకేష్‌నాథ్ మాత్రం షాపింగ్ మాల్
విషయంలో ఏమీ మాట్లాడం లేదు. ఈ విషయంలో మాధురీనే మాట్లాడుతారని తానేమి చెప్పలేనని ఆయన స్పష్టం చేస్తున్నారు.