మలబార్ గోల్డ్ షోరూమ్ 49వ బ్రాంచి కూకట్ పల్లిలో ప్రారంభమైంది. రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ షోరూమ్ ను ప్రారంభించారు. డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ ఛైర్మెన్ అహ్మద్ మాట్లాడుతూ - హైదరాబాద్ లో ఇది రెండవ షోరూమ్. మా షోరూమ్ లలో నాణ్యత గల బంగారాన్నే విక్రయిస్తాము. ప్రపంచ వ్యాప్తంగా ఇది 49వది. మా 50వ షోరూమ్ ను మార్చి 14న కింగడమ్ ఆఫ్ ఖతార్ లో ప్రారంభమౌతుంది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కాకినాడతో పాటు మరో ఆరు ప్రాంతాల్లో షోరూమ్ లను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 2012 కల్లా ఆంధ్రప్రదేశ్ లో 14 షోరూమ్ లు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాము. తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో 2012 నాటికట్టా 100 షోరూమ్ లను ప్రారంభిచనున్నాము.
మా మలబార్ సంస్థ కేవలం గోల్డ్ వ్యాపారమే కాకుండా మలబార్ చారిటబుల్ ట్రస్టు ద్వారా 1999 నుండి రోగులకు దాదాపు 1,79,156 మంది రోగులకు మందులకు ఉచతంగా అందించడం జరిగింది. అలాగే 2004లో స్థాపించిన హౌసింగ్ ఛారిటీ ద్వారా ఇప్పటి వరకు 3,045 ఇళ్ళు కట్టించాము. దీనితో పాటు కేరళలో ‘మలినీయ ముక్త కేరళం’ అనే కార్య్రకమాన్ని నిర్వహించాము. మా సిబ్బందికి కూడా పలు కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో పలు కార్యక్రమాలు చేయనున్నాము అన్నారు.