Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
‘‘హి స్ స్’’ కోసం దిగంబరంగా మల్లిక

     ‘మర్డర్’లో హద్దూ ఆపూలేని దృశ్యాల్లో రెచ్చిపోయి హిమేష్ రేష్మియాతో నటించి, గుర్తింపు పొందిన నటి మల్లికా షెరావత్. ఆ తర్వాత కూడా రకరకాల పాత్రలు చేసినా ఆకట్టుకోలేకపోయింది. అప్పటి నుండి హాలీవుడ్ వేపు దృష్టి పెట్టి జాకీచాన్ తో చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. కమల్ హసన్ ‘దశావతారం’లో మల్లిక మరోసారి మన ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల హాలీవుడ్ లో పాము ప్రధానంగా నడిచే ‘హి స్ స్’ చిత్రంలో నాయికగా ఎన్నికైంది. దీనికి జెన్నిఫర్ వించ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం మల్లిక వివిధ విధాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన ప్రపంచ చిత్రోత్సవాల్లో కూడా ఆమె వెరైటీగా ప్రచారం చేసింది. ఇప్పుడు పామును తలపించేలా, కేవలం శిరోజాలనే అడ్డం పెట్టుకుని దిగంబరంగా మల్లిక దిగిన ఫోటోలు విశేషంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ‘హి స్ స్’ని ఎలాగైనా విజయవంతం చేస్తే హాలీవుడ్ లో తనకు స్థానం ఖాయమని మల్లిక దృఢంగా విశ్వసిస్తోంది. ఈ చిత్రం విడుదలయ్యేలోగా ఆమె మరెన్ని ప్రయోగాలు చేస్తుందో వేచి చూద్దాం!

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005