Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మల్లిక కళ్ళల్లో నీళ్ళు...

      కేన్స్ ఫిల్మోత్సవ్ కి నేను వెళ్ళినపుడు వేలకొద్దీ కెమేరాలు నన్ను చుట్టుముట్టి, ఫోటోలు తీస్తుంటే నా సినీ జీవిత ప్రయాణంలో ఎత్తుపల్లాలు గుర్తుకొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి- అంటూ చెబుతోంది సెక్సీనటి మల్లికా షెరావత్.

‘వయాగ్రా’ వంటి దురలవాట్ల దుష్పరిణామాలకు మన సమాజంలో చోటుంది. కానీ మాలాంటి నటీమణుల ఎక్స్పోజింగ్ కి మాత్రం అవకాశం లేదా?- అని ఆమె ప్రశ్నిస్తోంది. నటిగా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాలని అనుకుంటాను. ఎన్నో సమస్యలని మరిచిపోయేందుకు థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడంలో తప్పు లేదనుకుంటా. ఎక్స్పోజింగ్ ఎంత చేసినా హద్దు దాటను. అందుకే నగ్నంగా ఫోజులివ్వమని, భారీ మొత్తం ఆశ చూపినా ‘ప్లేబాయ్’ ప్రతికకు ‘నో’ చెప్పాను.

నాకేం కావాలో అదే చేస్తాను. ఇంట్లో కూర్చొని, అవకాశాలు రాలేదని బాధపడను. అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాదు. మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. సింప్లిసిటీ అంటే నాకు బాగా ఇష్టం. నేను పొగ తాగను. అల్కహాల్ ముట్టను. రాత్రి పదికల్లా ఠంచన్ గా నిద్రపోతాను. మీడియాముందు మాట్లాడేటప్పుడు ఎలాంటి మొహమాటాలకి, దాపరికాలకి తావు ఇవ్వను. కల్మషం లేకుండా ఓపెన్ గా వుండటం నానైజం. ఎలాంటి విమర్శనైనా నేను పాజిటివ్గా స్వీకరిస్తాను. ఎందుకంటే, అవి మనమేంటో మనకి గుర్తుచేస్తాయి. మన ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి.

21ఏళ్ళకే ప్రముఖ పత్రికలు ‘స్పూప్’, ‘కాస్పో పాలిటన్’ల ముఖ చిత్రాల్లో కనిపించడం నేను గర్వించే విషయం. అలాగే, ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు ‘యాని’ తొలిసారి ఓ పాటను రాసి, నాకు అంకితం చేయడం నిజంగా నా అదృష్టం... గొప్పవరం.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005