మసాలా
 
 
 
 
వరుడు కావాలి
తరచూ వార్తల్లో కనిపించే నటీమణుల్లో మమతామోహన్‌దాస్ ఒకరు. చక్కని శరీరాకృతితో చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ అందాల గుమ్మకు నటిగా తానేమిటో నిరూపించుకునే అవకాశం రాలేదనే చెప్పాలి. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో నటించి తన కంటూ మంచి స్థానం కోసం ఇంకా పోరాడుతునే ఉన్నారు. అయితే ఈ కేరళ కుట్టి గురించి వదంతులు మాత్రం కథలు కథలుగా ప్రచారం అవుతుండడం విశేషం. ఆ మధ్య ప్రముఖ యువ సంగీత దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా పెళ్లికి సిద్ధమైనట్లు త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సందర్భంగా ఈ కేరళకుట్టితో భేటీ..

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వస్తున్న వార్తల గురించి?
(నవ్వుతూ) ఇలాంటి నిరాధార వార్తలు ఇంతకు ముందు చాలా వచ్చాయి. ఇదీ అలాంటిదే. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. నా కోసం అమ్మానాన్న వరుడి అన్వేషణలో ఉన్నారు.

పెళ్లి ఘడియలు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట?
నిజం చెప్పాలంటే ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. ఒక్క తమిళ చిత్రం, మూడు మలయాళ చిత్రాలు చేతిలో ఉన్నాయి. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలని ఏ నటి కోరుకుంటుంది చెప్పండి.

తమిళంలో అరుణ్‌విజయ్ సరసన నటిస్తున్న చిత్రం గురించి?
తమిళంలో నేను నటిస్తున్న మూడవ చిత్రం తడయిర తాకు. అరుణ్ విజయ్ హీరో. గౌతమ్‌మీనన్ శిష్యుడు మగిళ్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకుడు.

తడయిర తాకు చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి?
నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను గానీ చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. దీనికి యువ సంగీత దర్శకుడు తమీన్ అద్భుతమైన పాటలను అందిస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
తమిళంలో తడయిర తాకు చిత్రంతో పాటు మలయాళంలో మూడు చిత్రాలు చేస్తున్నాను. వీటిలో నాయిక చిత్రం త్వరలో విడుదల కానుంది. జయరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సీనియర్ నటి శారద జీవిత కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో నేను ఒక పాట కూడా పాడాను. ఈ చిత్రం ఓనం పండుగ సందర్భంగా తెరపైకి రానుంది. అలాగే కేకే.రాజీవ్ దర్శకత్వంలో ఒక చిత్రం, శ్యామ్‌ప్రసాద్ దర్శకత్వంలో నున్ అనే చిత్రంలోనూ నటిస్తున్నాను.