మసాలా
 
 
 
 
‘మేం వయసుకు వచ్చాం’ - ట్రైలర్, పోస్టర్ ఆవిష్కరణ
తనీష్, నీతిటేలర్ నటీనటులుగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మేం వయసుకు వచ్చాం’. లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై బెక్కం వేణుగోపాల్ మరియు లక్ష్మణ్ కేదారి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, పోస్టర్స్ ఆవిష్కరణ ఈ రోజు హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. మధుర శ్రీధర్, దాము, శేఖర్ చంద్ర ట్రైలర్స్ ని ఆవిష్కరించగా, అల్లరి నరేష్, నిఖిల్, తనీష్ పోస్టర్లను ఆవిష్కరించారు.

మధుర శ్రీధర్ మాట్లాడుతూ- ‘ఇదొక మంచి లవ్ స్టోరీ. మనస్సుకి హత్తుకునే సన్నివేశాలు ఈ సినిమాలో వున్నాయి. తనీష్ కి మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. కథానాయిక కొత్త అమ్మాయి అయినా బాగా చేసిందని దర్శకుడు చెప్పారు. ఈ నటీనటులిద్దరికీ మంచి భవిష్యత్ వుంది. ట్రైలర్స్ బాగున్నాయి. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు.

దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ‘రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే అది కూడా పూర్తి చేస్తాము. త్వరలోనే ఆడియో రిలీజ్ కూడా వుంటుంది’ అన్నారు.

ముఖ్యఅతిథులుగా విచ్చేసిన నిఖిల్, నరేష్, స్వర్ణ, బసిరెడ్డి ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా విజయవంతం కావాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు.