Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
మోనికని వాడుకుని వదిలేసారు

      ‘నన్ను అందరూ మోసం చేశారు. అవసరానికి తగ్గట్టు అన్ని విధాలుగా నన్ను వాడుకున్నారు..’ అంటూ వాపోతోంది బాలీవుడ్ భామ మోనికా బేడీ.

తెలుగులోనూ ఒకటీ అరా చిత్రాల్లో నటించిన మోనికాబేడీ అవకాశాల కోసం మాఫియాని ఆశ్రయించి, ఆ తర్వాత పోలీసులకు చిక్కి కటకటాల్లెక్కెట్టిన సంగతి తెల్సిందే. రీ - ఎంట్రీలో బుద్ధిగా అవకాశాల కోసం ప్రయత్నించినా, మాఫియా బ్యాక్ గ్రౌండ్ కాస్తా ఆమెకు ఛీత్కారాలు, చీదరింపుల్నే మిగిల్చింది.

అయితే మాఫియాని అడ్డం పెట్టుకుని అవకాశాలు గతంలో రాబట్టుకున్నప్పటికీ, ఇప్పుడు సినీ పరిశ్రమలో వున్న రాజకీయాలు మాఫియా కన్నా హీనంగా వున్నాయని మోనికా బేడీ వాపోతోంది. కొన్ని రియాల్టీ షోలలో చాలా ఇంట్రెస్ట్ తో తాను పార్టిసిపేట్ చేసినా, తన పాపులారిటీ ఆయా ఛానళ్ళు వాడుకుని, తనను మోసం చేశాయని మోనిక కన్నీరు మున్నీరవుతోంది.

నటన తనకు ప్రాణమనీ, అందుకే నటనను వదులుకోలేకపోతున్నానని మోనికాబేడీ ఎంత వాపోతున్నా, ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగానే వుందిట. ఆర్థికంగా చితికిపోయాననీ, మానసికంగానూ కుంగిపోయాననీ, మాఫియా చేతుల్లోకి వెళ్తే ఎలా వుంటుందో తనను చూసి ఎవరైనా గుణపాఠం నేర్చుకోవాలని చెబుతోంది మోనికా బేడి.

అయితే, మోనిక నిజ జీవితంలోనూ నటించేస్తోందనీ, మాఫియా డాన్ అబూ సలేం పంచన చేరి వందల కోట్లు మోనికా వెనకేసుకుందని బాలీవుడ్ లో గుసగుసలు విన్పిస్తుండడం గమనార్హం.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005