Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
సంగీత ప్రధానంగా ‘మ్యూజిగల్.కామ్’

      భారతీయ సంగీతాన్ని ప్రపంచ సంగీత అభిమానులకు అందించేందుకు అనేక అద్భుతమైన ఫీచర్స్ తో రూపొందిన మొట్టమొదటి సంగీత ప్రధానమైన సోషల్ నెట్వర్క్ పోర్టల్ ‘మ్యూజిగల్.కాం’. ‘లలితసంగీత ప్రయోక్త పాలగుమ్మి విశ్వనాథం, రావు బాలసరస్వతి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మ్యూజిగల్ సంస్థ సిఈవో ఆనంద్ కూచిభొట్ల, ఛైర్మన్ షాన్ అప్పజోడు, దీపిక అప్పజోడు, సినీ సంగీత దర్శకులు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులు, వాద్య కళాకారులు, స్లం డాగ్ మిలియనీర్ చిత్రానికి రహమన్తో పనిచేసిన సంగీత దర్శకుడు ప్రవీణ్ మణి, కూచిపూడి రాధారెడ్డి రాజారెడ్డి, జొన్నవిత్తుల, గజల్ శ్రీనివాస్, సుద్దాలఅశోక్ తేజ, కోడిరామకృష్ణ, రామాచారి, రఘు కుంచె, భాస్కరభట్ల రవికుమార్, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, గంగాధర్, ఎ.వి.ఎస్., కళ్యాణి మాలిక్, జూనియర్ రేలంగి, బంటీ, సందీప్, భార్గవ్, మల్లాది బ్రదర్స్, రవివర్మ, అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ లోని మరికొందరు ఔత్సాహిక కళాకారులు పాల్గొన్నారు.

మ్యూజిగల్ సంస్థ సిఈవో ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ- ’భారతీయ సంగీతంలోని అన్ని రకాల సంగీత ప్రక్రియలకు (సినీ సంగీతం, లలిత సంగీతం, జానపదం, శాస్త్రీయసంగీతం, భక్తి సంగీతం) ఇంటర్నెట్ మాధ్యమంలో ఏకైక సంగీత ప్రధాన పోర్టల్ మ్యూజిగల్.కామ్ (www.muzigle.com)లో అన్ని భారతీయ భాషల సంగీతం ఉచితంగా వినవచ్చు. అంతేకాకుండా నిర్ణీత రుసుము ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యూజిగల్ ద్వారా భారతదేశంలోని సంగీతం పట్ల అభిరుచి, నైపుణ్యం, ఉత్సాహం, అంకితభావంవున్న సంగీత కళాకారులు, రచయితలు, సంగీత నిర్దేశకులు, గాయకులు, వాద్య కళాకారులను ప్రపంచ సంగీత అభిమానులకు దగ్గర చేయడమే మ్యూజిగల్ ధ్యేయం. అంతేకాకుండా ఈ మ్యూజిగల్ ద్వారా ఔత్సాహిక కళాకారుల సంగీతానికి సరైన ఆర్థిక వనరులు చేకూర్చడం కూడా మ్యూజిగల్ ఆశయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా వున్న సంగీత అభిమానులకు, ఔత్సాహిక భారతీయ సంగీత కళాకారులకు ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ఎల్లలు చెరిపేసి వారి సంగీతానికి ప్రాచుర్యం కలిగించడం మ్యూజిగల్ లక్ష్యం’ అని వివరించారు.

మ్యూజిగల్ సంస్థ ఛైర్మన్ అప్పజోడు మాట్లాడుతూ- ‘సంగీత అభిమానులు వారికి ఇష్టమైన కళాకారుల, సినిమాల, సంగీత దర్శకుల ఆల్బమ్స్, సంగీతం, పాటలు, సుస్పష్టంగా, చక్కటి క్వాలిటీతో వినొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పేజి ద్వారా ప్రపంచంలోని మరింత మంది సంగీత అభిమానులతో అనుసంథానం కావచ్చు. సోషల్ నెట్వర్క్ అయిన ఆర్కుట్, ఫేస్ బుక్, మై స్పేస్ వంటి సోషల్ నెట్వర్క్ ల ద్వారా మీకిష్టమైన సంగీతాన్ని, మీ ప్రతిభని ప్రపంచవ్యాప్తంగా వున్న స్నేహితులతో పంచుకోవచ్చు. మ్యూజిగల్ ద్వారా ఆయా కంపెనీలు తమ సంగీతం ఆల్బమ్స్ ని మ్యూజిగల్ ద్వారా అమ్మకానికి వుంచవచ్చు. ప్రతీ ఆల్బంకు ఒక మైక్రో సైట్ ద్వారా ప్రాచుర్యం కల్పించవచ్చు’ అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005