అక్కినేనికి చెందిన మూడు తరాల నటులు (నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య)తో క్రియేటివ్ దర్శకుడు
కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం
మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే... కృష్ణవంశీపై ఒక అపవాదు
ఉంది - కథనం విషయంలో బ్యాలెన్స్ తప్పుతాడని. ‘చంద్రలేఖ’ సినిమా తరువాత నాగార్జునకు,
కృష్ణవంశీకి దూరం పెరిగిందని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఇటీవల ఆ దూరం తగ్గిందని నాగార్జునతో ఇటీవల భేటీ
అయిన కృష్ణవంశీ ఒక కథ చెప్పాడని తెలుస్తుంది.
కృష్ణవంశీ వంటి క్రియేటివ్ జీనియస్ షార్ట్ కట్ లో కథ చెప్తే ఆ కథ ఎవరికి నచ్చకుండా వుంటుంది?..
షరామామూలుగానే నాగార్జునకు నచ్చింది.అయితే అక్కినేని నాగార్జున ఇక్కడ ఒక షరతు విధించాడట. చెప్పిన
కథకు మొత్తం సీన్లన్నీ రాసుకుని, డైలాగులు కూడా వ్రాయించుకుని ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ తో వస్తే అప్పుడు సినిమా
ఒకే చేస్తానని చెప్పాడంట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించాడు.దీంతో ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ ను
తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాడట కృష్ణవంశీ.
|