తెలుగులో కథానాయికగా పరిచయమై పరాజయాల కారణంగా, క్రమంగా తమిళ చిత్ర రంగంలో గ్లామర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నమిత ఇప్పుడు‘సెక్స్ బాంబ్’గా మారింది. ఒకదశలో తమిళ అభిమానులు ఆమెకు గుడి కట్టించే ప్రయత్నం కూడా చేశారు. ఇటీవలవరుసగా చిత్రాలు చేస్తున్న నమిత, ఇకపై ఆచి తూచి చిత్రాలు చేస్తానని అంటోంది. వచ్చిన చిత్రాలన్నీ చేయడం వల్ల నటిగా గుర్తింపుతెచ్చే పాత్రలకన్నా అప్రధానమైనవే ఎక్కువవుతున్నాయని ఆమె భావన. ‘‘మీ పాత్ర బాగుంటుంది’’, ‘‘సినిమాకు మీ పాత్ర కీలకం’’ అంటూ ఆమెను ఒప్పించినవారు, సినిమాలో మాత్రం ఏదో పేరుకే కనిపించేలా చేస్తున్నారు. ఇదేమంటే- నిడివి పెరిగిపోవడంతో కొంత తగ్గించామని, మరేదో అర్థంలేని కారణాలు చెబుతున్నారు. ఓ చిత్రంలో అయితే నా పాటను మాత్రం వుంచి, సన్నివేశాలన్నింటినీ తీసేశారు. ఇలా అయితే నటిగా నాకేం ఉపయోగం వుండదు. కేవలం గ్లామర్ పాత్రలకే కాదు, నటిగా పెర్ఫార్మెన్స్ కి అవకాశం కూడా వుండేవే ఇకపై చేస్తాను. ఇకమీదట ఎవరూ నన్ను మోసం చేయలేరు’ అని అంటోంది నమిత.
సీరియస్ గానే నమిత ఈ నిర్ణయం తీసుకుందని తెలిసినవాళ్ళు అంటున్నారు. ప్రాధాన్యత లేని 14 సినిమాలని నమిత మొహమాటం లేకుండా తిరస్కరించిందట. సినిమాల సంఖ్య... డబ్బులు మాత్రమే కాదు, నటిగా నాకు పేరు తెచ్చే పాత్రలే ఇకపై చేస్తాను- అని చెబుతున్న నమిత తెలుగులో బాలయ్య కాంబినేషన్లో ‘సింహా’లో చేస్తోంది.
|