అభిమానులను ప్రేమగా బావా అని పిలిచే ఏకైక హీరోయిన్ నమిత. తనదైన సొగసులతో గ్లామర్ క్వీన్‌గా పేరు
తెచ్చుకున్నారు. ప్రస్తుతం కాస్త విరామం తీసుకుని బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారు. సరికొత్త అందాలతో మరోసారి
విజృంభిస్తానంటున్న ఈ అందాల తారతో చిన్న భేటీ...
ప్ర: ప్రస్తుతం నమిత హవా ఎలా ఉంది?
జ: నా హవా ఎప్పుడూ తగ్గదు. ఈ మధ్య నా అంతట నేనే కొంచెం గ్యాప్ తీసుకున్నా. బరువు తగ్గించుకునే పనిలో ఉన్నా.
సినీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు నన్ను చూసేం దుకు ఎగబడే అభిమాన గణాన్ని సముదాయించడానికి పోలీసులు పడే
అవస్థలు చూస్తే తెలుస్తుంది నా హవా ఏమిటో. అలాంటి అభిమానులకు (మచ్చాన్) మంచి చిత్రాలను అందించాలన్నదే
నా తపన.
ప్ర: మీకు నచ్చిన హీరో ఎవరో మనస్ఫూర్తిగా చెప్పండి?
జ : నేను నటించిన హీరోల్లో అజిత్ ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. చిత్ర విజయం కోసం ఆయన చేసే పోరాటం, పడే
శ్రమ ఆశ్చర్యపరుస్తాయి.
ప్ర: మీరు, నయనతార కలిసి నటిస్తే ఆ చిత్రం హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడినట్లుంది?
జ: నిజమే. నేను, నయనతార కలిసి తెలుగులో సింహా చిత్రంలో నటించాం. ఆ చిత్రం ఘన విజయం సాధించింది.
తమిళంలో చేసిన బిల్లా కూడా హిట్ అయ్యింది. బిల్లా చిత్రం షూటింగ్ సమయంలో మొదట్లో సహ నటీమణులుగా
మర్యాదగానే నడుచుకున్నాం. చిత్రం సగం షూటింగ్ పూర్తి అయ్యేసరికి కారణం తెలియదు గానీ స్నేహం సన్నగిల్లడం
మొదలయిం ది. నిజంగా ఇది బాధాకరమైన విషయం. నయనతార పెళ్లి చేసుకోనున్నట్టు తెలిసింది. ఆమెకు నా అడ్వాన్స్
కంగ్రాట్స్.
ప్ర: సిల్క్‌స్మిత పాత్రలో నటించడానికి విద్యాబాలన్ కంటే కూడా నమిత కరెక్ట్ అని నటుడు వినూ చక్రవర్తి చేసిన కామెంట్ గురించి?
జ: నటి సిల్క్‌స్మితను నేను ప్రత్యక్షంగా చూడలేదు. అయితే ఆమె నటించిన కొన్ని చిత్రాలను టీవీలో చూశాను. స్మిత
అందం, అభినయం, నాట్యం గురించి పలువురు చెప్పుకోవడం విన్నాను. ఆమె పాత్రలో సమర్థవంతంగా నటించచగల నటి
విద్యాబాలన్. ఆమె పాత్రలో లీనమై నటించారు.
ప్ర: నమితా నాకు అన్నం పెడుతుందా? అంటూ నటి సోనా మీపై మరోసారి ధ్వజమెత్తడంపై మీ స్పందన?
జ : సోనాకు తినడానికి లేకపోతే నా ఇంటికి రమ్మనండి పోషిస్తాను. ఇతరులను అడ్డం పెట్టుకుని సంపాదిస్తే అది
వంటబట్టదు.