మహేష్‌బాబు సతీమణి మాజీ మిస్ ఇండియా అయిన నమ్రతా శిరోద్కర్ పెళ్ళైన తర్వాత చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తాజా నిర్మాతగా సగటు ప్రేక్షకుడి దైనందిన జీవితంలో ఒక భాగంగా పెనవేసుకుపోయిన టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది.
ఇప్పుడు నమ్రత కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతుంది. ఈ విషయంపై నమ్రత స్పందిస్తూ అవును నేను నిర్మాతగా మారాను, మరాఠీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌లో ఒక టి.వి కార్యక్రమాన్ని నిర్మిస్తున్నాను. నేను మరాఠీ అమ్మాయిని అందువల్ల ఆ భాషలోనే తొలిసారిగా నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయిం చుకున్నాను. ఇదొక్కటే కారణంకాదు, నా చెల్లెలు శిల్పా శిరోద్కర్ పెళ్ళి చేసు కొని బాలీవుడ్ చిత్రాలకు స్వస్తి చెప్పింది. చాలా కాలం తర్వాత తను ఒక చిన్నపిల్లల రియాలిటీ షోను మరాఠీ చానల్‌నందు నిర్వహించేది. దానికి శిల్పతో పాటు నేను కూడా ఆ కార్యక్రమానికి జడ్జీగా వ్యవహరిస్తుం డేదాన్ని. తరువాత నేను మా సిస్టర్ శిల్పకలిసి ఒక కార్యక్రమాన్ని నిర్మించాలనుకున్నాం. అని నమ్రతా మహేష్ బాబు వివరించారు.
ముంబయ్‌లో తన షూటింగ్‌లో తీరికలేక చాలా రోజులపాటు తను కుటుంబానికి దూరంగా ఉన్నారు. దాంతో షూటింగ్‌ను హైదరా బాద్‌కు మార్చుకున్నారు. -నాకు ముంబయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు కుటుంబం మీద ఉన్న ప్రేమతో నావర్క్‌పట్ల నేను సరిగా శ్రద్ధ వహించలేక పోయేదాన్ని దాంతో నా సౌకర్యార్ధం షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చుకున్నాను. ఇప్పుడు నాపనిని బాగా చూసుకోగలుగుతున్నాను అని మాజీ మిస్‌ఇండియా నమ్రత తెలిపారు.
-హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్‌నందు ఇప్పుడు చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా వీటిని ప్రముఖులు, ప్రముఖ సంస్థలు భారీవ్యయంతో సినీ తారాగణంతో నిర్మిసున్నాయి. ఇలాంటి సమయంలో నేను ఏ అనుభవం లేకుండా అక్కడ కాలుమోపి ఆపోటీని తట్టుకొని నిలబడాలంటే చాలా కష్ట పడాల్సివస్తుంది. కానీ తప్పకుండా నేను హిందీలో కార్యక్రమాలను రూపొందిస్తాను దానికి నాకు కొంచెం సమయం కావాలి. ఇతర భాషల్లో నిర్మిస్తున్న కార్యక్రమాలను బాగా పరిశీలిస్తున్నాను. ఇవినాకు చాలా ఉపయోగపడుతున్నాయి అని నమ్రత వెల్లడించారు.
|