బాలీవుడ్లోకి కొత్త జనరేషన్ ప్రవేశిస్తోంది. హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా చేస్తే మన
తెలుగువారు ఒప్పుకోరు. కానీ బాలీవుడ్లో మాత్రం ఇది చాలా సర్వసాధారణం. రణదీర్ కపూర్
కూతుళ్లు కరీష్మా కపూర్, కరీనా కపూర్లు బాలీవుడ్ని ఊపేశారు. అనీల్ కపూర్ కూతురు
సోనమ్ కపూర్, కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా బాలీవుడ్లో రాణిస్తున్నారు.
పోయినేడాది శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా కూడా దబాంగ్ సినిమాలో సల్మాన్ సరసన
నటించి హిట్ కొట్టింది.
తాజాగా నటుడు గోవిందా చిన్న కూతురు నర్మదా అహుజా కూడా తెరంగేట్రం చేస్తున్నట్టు
బాలీవుడ్ టాక్. ఆమె ఇంకా ఒక్క సినిమాలో కూడా నటించకుండానే మూడు సినిమాల్లో నటించే
అవకాశం వచ్చింది. దీన్ని బట్టే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమ కథ,
రోమాంటిక్ కామెడీ, ఫ్యూర్ కామెడీ ఈ మూడు చిత్రాల్లో దేన్ని ముందుగా ఎంచుకోవాలని
నర్మదా, గోవిందా తెగ ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు.
నర్మదా మాత్రం ముందు రోమాంటిక్ కామెడీ చిత్రంలోనే చేయాలన్న ఆశతో ఉందని ఆమె
సన్నిహితులు చెబుతున్నారు. కొత్త హీరోతో కాకుండా స్టార్డమ్ ఉన్న హీరో సరసన చేసేందుకు
ఆమె ఇష్టపడుతోందట. అన్నట్లు... నర్మదా ముంబాయిలోని కిషోర్ నమిత్ కపూర్
ఇనిస్టిట్యూట్లో, లండన్లోని ఓ యాక్టింగ్ స్కూల్లో కూడా శిక్షణ తీసుకుందట.