మసాలా
 
 
 
 
తల్లిని ధ్వేషించే తనయ
2010లో అద్భుత విజయాలందుకున్న అందాలతార నయనతార. దక్షిణాది నాలుగు భాషల్లో నేటికీ ఈ ముద్దుగుమ్మ హాట్ గాళ్. ప్రభుదేవాతో ప్రేమాయణం నడుపుతున్నా... ఏమాత్రం చెక్కుచెదరని అవకాశాలతో తనదైన శైలిలో 2011లో సైతం సరికొత్త శిఖరాలను అధిరోహిస్తానని చెబుతోంది. నయనతార చెప్పిన తాజా సంగతులివి...

- ఫిబ్రవరిలో రిలీజ్ ‘ఎలక్ట్రా’
మలయాళంలో ‘ఎలక్ట్రా’ అనే చిత్రం కూడా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రధారులు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజవుతుంది. అలెగ్జాండ్రా అనే గ్రీక్ డ్రామా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ‘ఎలక్ట్రా’లో నా పాత్ర వేరు. నా తల్లి డయానాగా మనీషా నటిస్తున్నారు. తల్లిని ద్వేషించే తనయ పాత్రలో సరికొత్త ఉద్వేగాలు పండించే సినిమా ఇది. ఇఫి అంతర్జాతీయ చిత్రోత్సవాలు సహాపలు ఫెస్టివల్స్ లో ఈ సినిమా ఇప్పటికే ప్రదర్శించారు. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

- మమ్ముట్టి సినిమా
మరో క్లాసిక్ ‘మత్తిలుకల్’కి సీక్వెల్లో నటించాల్సివుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మమ్ముట్టి హీరో. లెజెండరీ డైరెక్టర్ ఆదూర్ గోపాలకృష్ణన్ అప్పట్లో దర్శకత్వం వహించిన ఈ క్లాసిక్ కి సీక్వెల్ వచ్చే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఏడాదిన్నర క్రితమే ఈ సినిమాలో అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చినా ప్రాజెక్ట్ మొదలవ్వలేదు. మార్చిలో ప్రారంభోత్సవం అంటున్నారు. అంతవరకూ ఏ విషయం చెప్పలేను. ప్రస్తుతానికి ‘శ్రీరామరాజ్యం’తో బిజీగా వున్నా. ఏదేమైనా... నేనా సినిమాలో నటించాలనే కోరుకుంటున్నా.

- తమిళ్, తెలుగు, హిందీలో ‘బాడీగార్డ్’
మలయాళంలో నేను నటించిన ‘బాడీగార్డ్’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఇటీవల తమిళంలోకి కూడా రీమేకైంది. నేనింకా ఆ సినిమా చూడలేదు. అయితే దర్శకుడు సిద్దిక్ మంచి ఇంటెలిజెంట్. స్ర్కిప్ట్ పరంగా అద్భుతమైన కమాండ్ వున్న వ్యక్తి. ఆ సినిమా బాలీవుడ్లో కూడా రీమేక్ అవుతోంది. అక్కడ సల్మాన్ ఖాన్ హీరో. కరీనా కపూర్ నేను చేసిన పాత్రత చేయడానికి ఉత్సాహపడుతోంది. నా పాత్ర చాలా ఇంప్రెస్ చేసిందని, తను ఇప్పటికే ప్రకటించారు కూడా. ఏదేమైనా నా సినిమా ప్రేరణనివ్వడం చాలా హ్యాపీ.