| ఈ మధ్య దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన ‘2 జి స్పెక్ట్రమ్’ కుంభకోణంలో ప్రధాన
నిందితురాలు నీరా రాడియా గురించి దేశ ప్రధాన ఛానళ్లన్నీ తెగ
మోతెక్కించడంతో... బాలీవుడ్ నిర్మాతల దృష్టి నీరారాడియాపై పడింది. ఒక
సాధారణ మహిళ అతి తక్కువ కాలంలోనే దేశ ఆర్థికవ్యవస్థనే సవాల్
చేయడమేగాక...రాజకీయ దురంధరులుగా పేరుగాంచిన హేమాహేమీలను తన
వలలో ఎలావేసుకుంది...తన ఆర్థిక లావాదేవీలను ఇన్నాళ్లుగా ఎలా
నడిపించింది...అవినీతిని పెంచిపోషించడంలో దేశంలో ఏ ప్రభుత్వ అధికారులను,
బ్యాంకు అధికారులనేగాక చిన్న చితక, బడా పారిశ్రామికవేత్తలందరినీ తన
కనుసన్నలతో ఏరకంగా అదుపులో పెట్టుకుంది వంటి ఆసక్తికరమైన విశేషాలతో
రసవత్తంగా ఓ కథను, స్క్రీన్‌ప్లేను సిద్ధం చేశారు. విషయం ఏమిటంటే ఇప్పటిదాకా
ఒక్క హిట్టూ లేని పూనమ్‌జావర్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. 1994లో
అక్షయ్‌కుమార్‌తో ‘మొహ్రా’ చిత్రంలో నటించిన పూనమ్‌జావర్ ఈ చిత్రానికిగాను
శృంగార పాత్ర పోషించేందుకు...హాట్‌హాట్‌గా నటించేందుకు ముందుకు వచ్చింది.
నీరారాడియా పర్సనాలిటీకి పూనమ్‌జావర్ అయితే సరిగ్గా సరిపోతుందని నిర్మాతలు
తనని ఎంపికచేశారని ఆనందంగా విలేకరులకు చెబుతోంది పూనమ్.
ఈ చిత్రాన్ని యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ సంస్థ నిర్మించనుండడం విశేషం.
సచ్చిత్ పురాణిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
|