మసాలా
 
 
 
 
'శృంగార తార' ముద్ర నుంచి బయట పడ్డాను
జూలీ, శీషా వంటి శృంగార చిత్రాలలో నటించిన మాజీ మిస్ ఇండియా నేహా ధూపియాను బాలీవుడ్ ఇటీవల వరకు ఆమె సెక్సీబ్యూటీగానే గుర్తించింది. తదనంతరం మిథ్య వంటి సినిమాల్లోనూ సత్తా నిరూపించుకోవడం వల్ల శృంగారతార ముద్ర నుంచి బయటికి రాగలిగానని నేహా చెప్పింది. ‘సెక్సీ సింబల్ నుంచి సాధారణ నటిగా మారడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. నేహా శృంగారతార అనే భావన చాలా మందిలో ఉండేది.

దాని నుంచి బయటికి రావడానికి చాలా ఓపిగ్గా ఎదురుచూశాను. నా కష్టానికి తగిన ఫలితం వచ్చింది. సెక్స్ సింబల్ ముద్ర నుంచి బయటపడ్డాను’ అని నేహా చెప్పుకొచ్చింది. జూలీ, శీషా సినిమాల్లో శృంగారం పాలు ఎక్కువ కావడంతో ఈ బ్యూటీ కాస్త ఇబ్బం దికి గురయింది. చుప్ చుప్‌కె, ఢిల్లీ హైట్స్, డియర్‌ఫ్రెండ్ హిట్లర్‌లో నేహా నటనకు మంచి మార్కులుపడ్డాయి. ‘నా కెరీర్ కొనసాగుతున్న తీరుపై సంతృప్తిగానే ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు నన్ను సాధారణ నటిగా గుర్తిస్తున్నారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే ఎనిమిదేళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించాను’ అని వివరించింది.

పరిణతి లేని దశలో అడుగుపెట్టిన తాను.. బాలీవుడ్‌లో ఎన్నో నేర్చుకున్నానని ఈ మాజీ మిస్ ఇండియా చెప్పింది. తన వృత్తిపైనా ఎంతో గౌరవం ఉందని తెలిపింది. ఈ 31 ఏళ్ల తార 2003లో విడుదలైన‘ఖయామత్: సిటీ అండర్ థ్రెట్’ సినిమాతో బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసింది. డబ్బు కోసం కాకుండా తనకు పేరు తెచ్చే సినిమాలను మాత్రమే అంగీకరించింది. మహిళా బంధిపోటుగా ఫస్ గయారే ఒబామాలో నేహా చేసిన పాత్రకు విమర్శకుల నుంచి అద్భుత ప్రశంసలు దక్కాయి. ఈమె తాజాగా నటించిన పప్పూ కాంట్ డ్యాన్స్ సాలా శుక్రవారం విడుదలవుతోంది. సౌరభ్‌శుక్లా దీనికి దర్శకుడు కాగా వినయ్‌పాఠక్ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు.