‘ఫేస్ బుక్’ సంస్థలో నెలకు లక్షరూపాయల జీతమిచ్చే ఉద్యోగం ఒకవైపు - ‘ఇట్స్ మై లవ్ స్టోరి’ చిత్రం ద్వారా లక్షలాది ప్రేక్షకులకు పరిచయమయ్యే గొప్ప అవకాశం మరోవైపు... ఈ రెండింటిలో ఏదో ఒకటి ఏంపిక చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు... రెండో అవకాశం వైపే మొగ్గు చూపా’నని అంటోంది ‘నికిత నారాయణ’. ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’లో హీరోయిన్ గా పరిచయమైంది. మధుర శ్రీధర్ దర్శకత్వం వహించాడు. మల్టీడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి. సమర్పణలో, షిరిడిసాయి కంబైన్స్ పతాకంపై డా.యం.వి.కె. రెడ్డి నిర్మించారు. ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా నడుస్తోందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హీరోయిన్ ‘నికిత నారాయణ’ తొలి చిత్ర అనుభవాన్ని ఇలా తెలియజేసింది.
పదేళ్ళ వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా ‘అన్నపూర్ణ ఐయొడైజ్డ్ సాల్ట్’ యాడ్ లో యాక్ట్ చేసే అవకాశం లభించింది. ఆ ప్రభావం వలనో ఏమో యాక్టింగ్ అంటే ఆసక్తి ఏర్పడింది. 2009లో ‘డాబర్ మిస్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్’గా ఎంపిక కావడం, 2010లో ‘మిస్ సౌత్ ఇండియా’ రన్నరప్ గా నిలవడం... మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
బిజినెస్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నాను. ‘ఫేస్ బుక్’ లాంటి ప్రఖ్యాత సంస్థలో నెలకు లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. కానీ మనసు మాత్రం నటన వైపే మొగ్గు చూపింది. ముఖ్యంగా ‘ఇట్స్ మై లవ్ స్టోరి’ చిత్రానికి జరిగిన స్టార్ హంట్ లో వందలాది అమ్మాయిల మధ్య హీరోయిన్ గా నన్ను ఎంపిక చేయటం ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది.
‘ఇట్స్ మై లవ్ స్టోరి’ చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఫేస్ బుక్ జాబ్ వదులుకుని తప్పు చేశానా... అనే చిన్న టెన్షన్ వెంటాడుతూ ఉండేది. కానీ ‘ఇట్స్ మై లవ్ స్టోరి’ విడుదలై విజయవంతం అయ్యాక, అందులో నేను ప్లే చేసిన ‘వందన’ క్యారెక్టర్ కు కాంప్లిమెంట్స్ లభించడం మొదలయ్యాక... చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ ఇప్పుడంతా నన్ను నా పేరుతో పిలవడం మానేసి ‘వందన’ అని పిలుస్తున్నారు. పరిచయ చిత్రంతోనే పెర్ఫార్మెన్స్ కు స్కోప్ వున్న హీరోయిన్ క్యారెక్టర్ లభించడం నిజంగా నా అదృష్టం. అయితే ఈ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ మధుర శ్రీధర్ కే చెందుతుంది. ఒక హిట్ సినిమాతో కెరీర్ ప్రారంభం కావడం చాలా గర్వంగా ఉంది. మా డైరెక్టర్ మధుర శ్రీధర్, మా ఫ్రొడ్యూసర్ యం.వి.కె.రెడ్డిలకు జీవితాంతం రుణపడి ఉంటాను.
ముందు ముందు మరిన్ని వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను. ‘ఇట్స్ మై లవ్ స్టోరి’లో ట్రెడిషనల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా చాలా వరకు సంప్రదాయపద్ధంగా నటించాను. అసరమైతే ఆల్ట్రా మోడర్న్ క్యారెక్టర్స్ చేయడానికి సైతం వెనకాడను. తాజా చిత్రం ద్వారా లభిస్తున్న గుర్తింపు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తోంది.