తాను ప్రేమ వివాహం చేసుకోనని నటి పూర్ణ అంటోంది. విజయ్ చేత చిన్న అసిన్‌గా పిలిపించుకున్న ఈ కన్నడ
భామకు ప్రస్తుతం కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్‌పై కన్నేసిన పూర్ణ అక్కడ సీమటపాకాయ్ చిత్రం
ద్వారా మంచి మార్కులే కొట్టేసింది. బికినీలు, ఈత దుస్తులు తన ఒంటికి పెద్దగా నప్పవని, అందుకే అలాంటివి
ధరించే విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తానని అంటోంది.
తమిళంలో నటించిన విత్తగన్, వేలూర్ మావట్టం చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపింది. వీటి
ద్వారా ఇక్కడ మళ్లీ అవకాశాలు రాబట్టుకుంటానని ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగులో చాలా అవకాశాలు
వస్తున్నాయని చెప్పింది. త్వరలో సొంతంగా నృత్య ప్రదర్శనశాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నానని
వెల్లడించింది.
నాట్యంలో తనకు శోభన స్ఫూర్తి అని తెలిపింది. సహ నటుడితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు జరుగుతున్న
ప్రచారం సంగతేమిటని విలేకరులు అడగ్గా అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. తన పెళ్లి విషయంలో
అమ్మానాన్నలకు ఎన్నో ఆశలు ఉంటాయని, వాటిని నెరవేర్చడం తన బాధ్యత అని అంది. తల్లిదండ్రులు
నిర్ణయించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మరో ఐదేళ్ల తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని తెలిపింది.