తెరవెనక కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తూ తెరమీదకొచ్చిన ఆరిస్ట్ ప్రభుదేవా. మంచి డ్యాన్సర్‌గా గుర్తింపునందుకుంటున్న
తొలినాళ్లలోనే హీరో అవకాశాలు వచ్చి పడ్డాయి. హీరోగానూ కావాల్సినన్ని విజయాలే అందుకున్నాడు. గత కొన్నాళ్లుగా
దర్శకత్వం మీద దృష్టిసారించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శంకర్‌దాదా ఎంబిబిఎస్, వాంటెడ్ చిత్రాలను తీశారు.
ప్రస్తుతం బాలీవుడ్ నటుడు అక్షరుకుమార్‌తో 'రౌడీ రాథోడ్' తీస్తున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మీడియాతో
ఇలా పంచుకున్నారు...
'రౌడీ రాథోడ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కానీ కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌ను తీసుకున్నారు ?
ఈ చిత్ర కథకి ఆమె శైలి అయితే బాగా సరిగ్గా సరిపోతుందన్న భావన ఉంది. క్లిష్టమైన భంగిమిలకు ఆమె అయితేనే
న్యాయం చేయగలుగుతారు. కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ చిత్రాల్లోని నృత్యాల్లో ఏదో లోపించినట్లుగా కనిపిస్తుంది.
అదేమిటో స్పష్టంగా చెప్పలేను. కానీ గతంలో ఉన్నంత మెరుపు ఉండట్లేదు. 'వాంటెడ్' సినిమాకీ బయటి కొరియోగ్రాఫరే
పనిచేశారు.
కథానాయుడు అక్షరుకుమార్. ఆయన్ను ఏ విధంగా చూపుతున్నారు ?
బాలీవుడ్‌లో ఉన్న అతికొద్దిమంది స్టార్ హీరోల్లో అక్షరు కుమార్ ఒకరు. ఆయన నటనేంటో అందరికీ తెలుసు. చిత్రంలో
యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. యాక్షన్ సీన్స్ చేయటం అక్షరుకి కొట్టిన పిండి. త్వరలోనే యాక్షన్
సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాను. యాక్షన్‌తోపాటు డ్యాన్స్, రొమాన్స్‌కి కూడా తగిన పాళ్లలో చూపుతాం.
ఉత్తరాదిన గుర్తింపు ఏ విధంగా ఉంది ?
ఎక్కడైనా సరే విజయం సాధించటం అవసరం. కష్టపడితే విజయం దానంతటదే వస్తుంది. ముందుగా అలవాటు
చేసుకోవాల్సింది కష్టపడటం.
సల్మాన్‌ఖాన్‌తో మరో సినిమా చేయనున్నారా ?
మేం ఇద్దరమూ స్నేహితులని చెప్పనుకానీ మంచి సంబంధాలు మా మధ్య ఉన్నాయి. ఆయన నటించిన చిత్రాలకు
కొరియోగ్రాఫర్‌గా పనిచేశాను. నేను దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రంలో ఆయన నటించటం ఆనందంగా ఉంది.
'వాంటెడ్'కు సీక్వెల్ తీస్తారా ?
అది నా చేతుల్లో లేదు. బోనీకపూర్, సల్మాన్ ఇష్టం. ఆ ప్రాజెక్ట్ మొదలవుతుందా లేదా అన్నది వారిద్దరిపై ఆధారపడ్డ
విషయం.
'రెమో' అన్న సినిమాలో నటిస్తున్నారంట ?
డ్యాన్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రం. కథా చర్చలు జరుగుతున్నాయి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా నేను మాత్రం ఓ
డ్యాన్స్ మాస్టర్‌గా కనిపిస్తున్నా. అయితే కొరియోగ్రఫీ మాత్రం నేను చేయటం లేదు. రెండు ఆలోచనలూ ఒకేసారి చేయటం
నాకు అలవాటు లేదు. ఇందులో నా దృష్టంతా నటనపైనే.
బాలీవుడ్ హీరోల్లో డ్యాన్స్ ఎవరు బాగా చేస్తారు ?
హృతిక్‌రోషన్ కంటే ఎవరుంటారు ! షాహిద్‌కపూర్, రణబీర్ కపూర్‌లు కూడా బాగానే చేస్తారు. నాకు హృతిక్‌తో పనిచేసిన
అనుభవం ఉంది. హృతిక్ డ్యాన్స్‌కి దక్షిణాదిన కూడా మంచి గుర్తింపు ఉంది.