మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ప్రకాష్ రాజ్ తన రెండో పెళ్ళికి
తేదీని ఆగస్టు 24ను ఖరారు చేసుకున్నారు. నటుడు శ్రీహరి భార్య
డిస్కోశాంతికి సోదరి అయిన లలితాకుమారి ప్రకాష్ రాజ్ మొదటి భార్య.
లలితాకుమారికి విడాకులిచ్చిన ప్రకాష్ రాజ్ కొన్నాళ్ళు ఒక రాజకీయ
నాయకురాలిని వివాహమాడతాడని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే
వీరిద్దరూ ఖండించారు కూడా. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ హిందీ సినిమా
చేస్తున్నప్పుడు బాలీవుడ్ కోరియోగ్రాఫర్ సోనీవర్మతో పరిచయం ప్రేమవరకూ
లాక్కొచ్చింది. వీరిద్దరూ రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు.
ముంబయిలోని ఆమె స్వగృహంలో ఈ వివాహం జరుగనుంది. ఇక
సోనీవర్మ తాజాగా ప్రకాష్ రాజ్ సొంత బ్యానర్ లో రూపొందిన తమిళ చిత్రం
పాటలకు కొరియోగ్రఫీ అందించింది. అలాగే ఆమె తెలుగులో పూరి
జగన్నాథ్ సినిమాలకూ, హిందీలో ప్రియదర్శన్ సినిమాలకూ ఎక్కువగా
ామె కొరియోగ్రఫీ చేసింది. ఇక గతకొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ లో
వున్నారు. ఆయన రెండోపెళ్ళికి శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత అయిన
బోనీకపూర్ నిర్మించిన ‘వాంటెడ్’ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ గా
నటించారు. ఆ సినిమాకు సోనీవర్మ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. మొదటి భార్యకు
ప్రకాష్ రాజ్ విడాకులు ఇవ్వడంతో తాజాగా సోనీ వర్మ వ్యవహారం
బయటపడింది. వీరు చాలా రోజుల నుండి సహజీవనం గడుపుతున్నట్లు
కూడా వార్తలు వచ్చాయి.
|