తమిళ చిత్రసీమ తనను నిర్లక్ష్యం చేస్తుందని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ‘కన్ గలాల్
ఖైదుసయ్’ చిత్రంతో ప్రియమణి తమిళంలో పరిచయమైంది. తరువాత ‘ఆదువరు కళాకాలం’,
‘పురుత్తి వీరన్’, ‘మలైకోట్టై’, ‘తోట’, ‘ఆరుముగం’, ‘నినైతాలే ఇనుక్కుం’ తదితర చిత్రాలలో
నటించారు. అయితే గత యేడాది కాలంగా ఆమెకు తమిళంలో నటించే అవకాశాలు రాలేదు. ఈ
విషయంపై ప్రియమణి మాట్లాడుతూ ‘పరుత్తి వీరన్’లో ఉత్తమ నటనను ప్రదర్శించానని అన్నారు.
ఇందుకు తనకు జాతీయ అవార్డు దక్కిందన్నారు. అయినా తమిళ చిత్రాలలో నటించే అవకాశాలు
తనకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ నిర్మాతలు, దర్శకులు తనను నిర్లక్ష్యం
చేస్తున్నారని, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదన్నారు. మణిరత్నం చిత్రం
‘రావణన్’లో నటించడం ద్వారా తన కల నెరవేరిందని అన్నారు. అయితే, అదీ పరాజయం
పాలుకావడం ఆమెను బాధిస్తోంది.
|