మసాలా
 
 
 
 
పర్యావరణ ప్రేమికురాలు ప్రియాంక
ఆధునిక సమాజానికి దూరంగా ఇప్పటికీ చీకటి బ్రతుకులు వెళ్ళదీస్తున్న పల్లెవాసులపై మీ అభిప్రాయం ఏమిటంటే..గంటల తరబడి ఉపన్యాసాలిచ్చేవారే ఎక్కువ. కాని ఆ పల్లె ప్రజల అవసరాలను తీర్చేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒకరే..మన బాలీవుడ్‌ అందాల సుందరి ప్రియాంక చోప్రా. సినిమాల్లో అందమైన పాత్రల్లో నటించి అలరించడమే కాదు..ఆసరా కోసం ఎదురు చూస్తూ..ఎదుగు బొదుగు లేకుండా ఉన్నవారిని ఆదుకోవడం కూడా తనకు తెలుసంటోంది ప్రియాంక. కోట్లకొద్ది డబ్బును కూడబెట్టడమే కాదు..నలుగురి ప్రయోజనం కోసం వినియోగిస్తేనే ఆ డబ్బుకు విలువుంటుందనే సత్యాన్ని నూటికి నూరుపాళ్ళు నమ్ముతోంది ప్రియాంక చోప్రా..ఇటీవలే రాజ స్థాన్‌లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూస్తోంది.

చూడటానికి చలాకీగా కనిపిస్తూ సౌందర్య ప్రేమికుల ఆరాధ్య దేవతల్లో ఒకరిగా వెలుగొందుతున్న ప్రియాంక చోప్రాలో..ఇంతటి సమాజ సేవ, దయా గుణం ఉన్నాయంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. అయితే అలా ఆశ్చర్యపోయేవాళ్ళ మతి పొగొట్టేలా..తన తోటి నటినటులను సైతం తన బాటలో నడిపించాలని ప్రయతిస్తుండటం నిజంగా అభినందనీయం. ఇక రాజ స్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోని ఐదు గ్రామాలను దత్తత తీసుకున్న ప్రియాంక చోప్రా.. ఆ గ్రామాలకు మౌలిక సదుపాయాలను అందిస్తోంది. విద్యుత్‌ సరఫరా, రక్షిత మంచినీరు, రవాణా వ్యవస్థ వంటి కీలక సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకున్న ప్రియాంక.. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.

సమయం చిక్కిన ప్పుడల్లా ఆ గ్రామాలకు వెళ్తున్న ప్రియాంక.. ప్రస్తుతం అవి బాగున్నాయని ఆనందంగా చెబుతోంది. అంతేగా కుండా పర్యావరణ పరిరక్షణకు తన వంతు సహాయం చేస్తూ..క్రమంగా క్షీణిస్తున్న ఓజోన్‌ పొరకు మళ్ళీ ప్రాణం పోస్తానంటోంది. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని చెబు తుండటమే కాకుండా ఏ వస్తువును వృధా చేయోద్దని, రీ సైక్లింగ్‌ ద్వారా వాటికి పునరుజ్జీవనం కల్పించాలని సూచిస్తోంది. ఎదుటివారికి సూచించడమే కాదు తొలుత తానే వాటిని ఆచరిస్తూ అందరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ ముం దుకెళ్తున్న ప్రియాంకా..అందుకు చేతనైనంత సాయాన్ని అందిస్తానని చెప్పకనే చెబుతోంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులుగా ఉన్నవారిలో కనిసం పదిశాతం సమాజ హితం కోసం పాటుపడాలనే కోరిక ఉంటే భవిష్యత్‌ లక్ష్యాలన్నీ ఇప్పుడే చేధించగలమనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది కదూ..