అవును. 20 నుంచి 65 మధ్య వయసులో సాగుతుంది నా పాత్ర. అది క్లిష్టమైన పని. ఆ గ్రాఫ్ మెయింటెయిన్ చేయడం అంత సులువు కాదు. దర్శకుడు విశాల్ నటీనటులపై మంచి అంచనాలతో ఉంటారు. దాన్ని రీచ్ అవ్వడం అంటే మరింత ఒత్తిడిని పెంచుతుంది. పైగా మేకప్ కోసం నానా కష్టాలు. ఉదయం 2గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ షూటింగ్ చేయాలి. మేకప్ కే 5గంటలు పడుతోంది. ‘సాత్ ఖూన్ మాఫ్’ నేను చేస్తున్న ఈ పాత్రను ఛాలెంజ్ గాతీసుకున్నాను.
- 65ఏళ్ళ భామలా కనిపించడం ఎలా అనిపిస్తోంది?
అలా నన్ను నేను చూసురోవడం ఇబ్బందిగానే ఉంది. గొప్ప సంగతేమంటే.. 20ల్లోనే 65 పాత్ర చేయడం.
- శరీర భాష కోసం ఏం చేస్తున్నారు?
సెట్ లో వృద్ధుల్ని అనుకరిస్తున్నా. రూపురేఖల్లో, నడక, నిలుచునే తీరులో...
- ఈ తరహా పాత్ర ఎంపికకు ‘ఫ్యాషన్’, ‘కమీనే’ చిత్రాలు తెచ్చిన ప్రశంసలే కారణమా?
‘ఫ్యాషన్’కు ముందే ఇలాంటి పాత్రలు చేసుండేదాన్ని ఛాన్సొస్తే. ఐదేళ్లు కావస్తోంది. ఇలా యంగ్ గా ఉన్నప్పుడే ఛాలెంజింగ్ పాత్రల్లో కనిపించాలి. ఐదేళ్ల తర్వాత ఇలా చేయగలనో లేదో? కమర్షియల్ సినిమాలో హాట్ గా కనిపిస్తూనే ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయాలి. అప్పుడే మజా!
- విశాల్ తన హీరోయిన్లని ఎప్పుడూ రిపీట్ చేయరు. మీ విషయంలో చేశారు.
ఆయన ఇండియాలోనే గొప్ప ఫిల్మ్ మేకర్. గర్వించే సినిమాలెన్నో తీశారు. వాటిలో ఎస్.కె.ఎమ్ ఒకటైతే బావుటుంది. నేను విశాల్ గర్ల్ అనిపించుకోవడం గర్వంగానే వుంటుంది. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం.
- మీ మరో ఫేవరెట్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ తర్వాతి సినిమా కరీనాతో చేస్తున్నారు?
అరే యార్! నేను వేరే దర్శకుడితో చేయట్లా? ఇదీ అంతే. మధుర్, నేను పెళ్ళికానివాళ్ళం. కరీనా సూపర్ యాక్టర్. మధుర్ - కరీనా కాంబినేషన్ వండర్. చూడదగ్గ సినిమా అవుతుంది.
- ‘కమీనే’ తర్వాత షాహిద్ కపూర్ తో సినిమా చేయలేదెందుకు?
షాహిద్ తో ఆఫర్లు చాలానే వచ్చాయి. చాలామంది నిర్మాతలు కలిశారు. ప్రాజెక్టులు మాట్లాడారు. ‘మౌనమ్’ కోసం షాహిద్ బిజీగా వున్నాడు. వచ్చే ఏడాది వరకూ డేట్స్ లేవు. నేనూ అంతే. వచ్చే జూన్ - జూలై వరకూ ఖాళీ లేదు. మరోసారి తప్పకుండా ఇద్దరం కలిసి చేస్తాం.
- ‘అంజానా అంజానీ’ టైమ్లో రణభీర్ తో స్నేహం గురించి?
రణభీర్ నాకు బాగా తెలుసు. జనాల్లో అప్పటికే మాపై రూమర్లున్నాయి. పార్టీల్లోనూ, దొరికిపోయాం. అంతమంది జనాల్లో మేమిద్దరమే... విడిగా కనిపించాం. నిజానికి మా మధ్య ఏమీ లేదు. ఇద్దరం మాటకారులం. పైగా కలిసిమెలిసి వుండే టైపు. ఎక్కువకాలం స్నేహంగానూ వున్నాం. అంతవరకే.
- ఇతర ప్రాజెక్టులు?
కత్రోన్ కె ఖిలాడి, డాన్ 2, తర్వాత అనురాగ్ బసు చిత్రం వుంటుంది. డేట్స్ కుదరక మరో ఐదు చిత్రాలు ఒప్పుకోలేకపోయా.
- ‘డాన్ 2’లో స్టంట్స్ కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు?
రోమాగా నటిస్తున్నాను. ఫైట్స్ చేయాలి. అందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నాను. పాత్రకు సరిపడే షేపుల కోసం కృషి చేస్తున్నాం. ఫర్హాన్, జోయాలు బిజీగా వున్నారు. వాళ్ళతో చర్చించాక తదుపరి ప్లానింగ్ వుంటుంది.
|