Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
నోరు కట్టుకోలేనంటున్న ప్రియాంక

     అభినయం, అందం ఉన్న నటి ప్రియాంకా చోప్రా. భిన్నమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంటోంది. తన అందం వెనుకున్న ఆరోగ్య విషయాలు ఇలా వివరించింది...

ప్రతిరోజు వ్యాయామం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఫిజిక్ ను కాపాడటం కోసం ఇంతగా కష్టపడాలా! ఆరోగ్యంగా ఉండటం కోసం ఏదో ఒక పని చేస్తే సరిపోతుంది. నేనైతే అలానే చేస్తా అందుకే నా శరీరం కొలతలు పెద్దగా మారవు. మమ్మల్ని చాలా మంది యువత అనుసరిస్తూ ఉంటారు. మాలా నాజూగ్గా అందంగా ఉండాలని రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే సరైన శిక్షణ లేకపోతే ఆరోగ్యానికి హాని జరుగుతుంది. అదే విధంగా తిండిని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. లావు అవుతాననే భయంతో నోరు కట్టుకుని ఉండటం నాకు కుదరని పని. ఇంట్లో ఏది వండితే అది తినేస్తాను. ఆహార పదార్థాల్లో నూనె శాతం తక్కువగా ఉండేలా జాగ్రత్త పడతాను. మంచి ఫుడ్ కనబడితే కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాదు. వారానికొకసారి చాక్లెట్లు, కేకులు, తందూరీలు లాగించేస్తాను. మటన్, చికెన్ సంగతి చెప్పక్కర్లేదు. బొంబేడక్ కూర అమ్మకి చాలా ఇష్టం అది వండిన రోజు ఇంటి పరిసరాల్లో నేను కనిపించను. ఎందుకంటే అది నాకు పడదు.

నేను చేసే పనిని దైవంగా భావిస్తాను. పనిలోనే ఆనందాన్ని వెతుకుతాను. ఇంట్లో వాళ్లతో కలిసి సినిమా చూడటంలో చెప్పలేని సంతోషం దొరుకుతోంది. చుట్టూ ఆశావాదంతో మాట్లాడేవాళ్లే ఉండాలనుకుంటా నిరాశగా మాట్లాడేవారికి నా మనసులో చోటు లేదు.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005