Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
ప్రియాంక ఏడుగురిని చంపేస్తుందట

      ‘‘ఆయనగారు నా ముందున్నప్పుడు నాకు గాల్లో తేలినట్లుగా అనిపించాలి. నాకలా అనిపించేలా చేసిన మగాడికి ‘మిస్టర్ రైట్’ అని బిరుదు ఇస్తా. అది మాత్రమే కాదు.. బుద్ధిగా అతనితో మూడు ముళ్ళు వేయించేసుకుంటా’’ అంటున్నారు ఫ్యాషన్ గాళ్ ప్రియాంక చోప్రా. మీక్కాబోయే భర్త ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? అనే ప్రశ్నను ప్రియాంక ముందు ఉంచినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో మరింత వివరంగా చెబుతూ - ‘‘నాకు రొమాంటిక్ పర్సన్స్ అంటే చాలా ఇష్టం. నాక్కాబోయే భర్తలో కచ్చితంగా ఆ క్యాలిటీ ఉండాలి. అతను నా పక్కన ఉన్నప్పుడు ప్రపంచాన్ని జయించినంత ధీమా నాకు కలగాలి. నాకు సరదాగా ఉండటం ఇష్టం. కాబట్టి అతనిలో ‘సెన్సాఫ్ హ్యూమర్’ మెండుగా ఉండాలి. నాపై తనకున్న ప్రేమను నేను పొంగిపోయేట్లుగా వ్యక్తపరచాలి. అబద్ధాలాడే వ్యక్తులంటే నాకు పరమ అసహ్యం. అందుకని నిజాలు మట్లాడే వ్యక్తినే భర్తగా కోరుకుంటున్నాను’’ అని చాంతాడంత లక్షణాలు కలిగిన జాబితాను చెప్పారు చోప్రా. ఒకే వ్యక్తిలో ఇన్ని లక్షణాలు ఉండటం కష్టం కాబట్టి... ప్రియాంక రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే బాగుంటుందని జోక్ చేసే బాలీవుడ్ వర్గాలు కూడా ఉన్నాయి. ఆ జోకులు ఈ సుందరాంగి చెవిలో పడనే పడ్డాయి. ఆ విషయమై ఆమె స్పందిస్తూ - ‘‘ప్రస్తుతం నేను యాక్ట్ చేస్తోన్న ‘సాత్ ఖూన్ మాఫ్’లో నాకు ఏడుగురు భర్తలు. ఒకరి తర్వాత ఒకర్ని చంపి పారేస్తాను. సినిమాలో అలా చేశాను కానీ నిజ జీవితంలో మాత్రం ఒకే ఒక భర్తనే కోరుకుంటున్నాను. వివాహ వ్యవస్థ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుని మన సంప్రదాయానికి అప్రతిష్ట తేవడం నాకు ఇష్టం లేదు’’ అన్నారు ప్రియాంక చోప్రా. ఇప్పటివరకు షాహిద్ కపూర్, హర్మాన్ బవేజా, గెరార్డ్ బట్లర్ తో ప్రియాంక ఎఫైర్ సాగించారనే వార్తలు వచ్చాయి. మరి.. ఆ వదంతులకు ఆమె రియాక్షన్ ఇలా ఉంది... - ‘‘వదంతులు వచ్చినప్పుడు నేను బాగా డిస్ట్రబ్ అవుతాను. సినిమా హీరోయిన్లకు కూడా మనసు ఉంటుంది. వాళ్ళకీ అమ్మ, నాన్న, తోబుట్టువులు ఉంటారు. వాళ్ళు కూడా బాధపడతారు. నా గురించి వార్తలు వచ్చినప్పుడు మావాళ్లు బాధపడతారు కానీ నన్ను ప్రశ్నించరు. నా మీద వాళ్లకి అంత నమ్మకం ఉంది’’ అన్నారు ప్రియాంక.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005