రేచెల్ వీజ్... హాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ‘ద మమ్మీ’, ‘ల వ్లీ బోన్స్’, ‘ద మమ్మీ రిటర్న్‌స’ లాంటి హిట్ సినిమాలు చూసినవారికి రేచెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ ముద్దగమ్మపేరు హాలీవుడ్‌లో మారుమోగిపోతోంది. రెస్లర్ సినిమా దర్శకుడు డారెన్ అరనోఫ్‌స్కీని జీవిస్తోంది. వీరి కాపురానికి గుర్తుగా వీరికో పిల్లాడు కూడా ఉన్నాడు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత రేచెల్‌కు ఇప్పుడు పెళ్ళి కళ వచ్చేసింది. ఇప్పుడు పెళ్ళికళ రావడమేంటని ఆశ్చర్యపోతున్నారా?!.. అవును నిజంగానే రేచెల్‌కు పెళ్ళి కళ వచ్చింది. ప్రపంచంలోని హాలీవుడ్ అభిమానులంతా ఇప్పుడు రేచెల్‌నే పెళ్ళాడదామనుకుంటున్నారట. ఎలాగంటారా... ఇటీవల చేపట్టిన ఓ సర్వే లో ఎక్కువమంది యువకులు రేచెల్‌ను పెళ్ళికూతురుగా ఎంపికచేసుకున్నారట. ఈ విషయం తెలిసిన రేచెల్ సిగ్గుల మొగ్గే అవుతోంది. ఆస్కార్ విన్నర్ అయిన రేచెల్ వీజ్ ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ‘ఎసై్క్వర్’ ఇటీవల నిర్వహించిన ‘వుమెన్... మోస్ట్ మెన్ వుడ్ లైక్ టూ మ్యారీ’ అనే పోల్ సర్వే లో ఎక్కువమంది యువత కోరుకుంటున్న పెళ్ళి కూతురిగా ఎంపికయ్యింది. ఇదిలా ఉండగా... మరో హాలీవుడ్ హాట్ గాళ్ కైరా నైట్లీ రెండవస్థానంలో నిలిచింది. ఇటీవలే మోస్ట్ డిజైరేబుల బాడీగా ఎంపికైన ‘టైటానిక్’ ఫేం కేట్ విన్‌స్లెట్ మాత్రం మూడవస్థానంతో సరిపెట్టుకుంది. ఇంకా కామేడియన్, హీరోయిన్ అయిన డాన్ ఫ్రెంచ్‌ను డ్రింక్ పార్ట్‌నర్‌గా ఎంచుకున్న అభిమానులు... తన హాటు హాటు అందాలతో యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్న చెరిల్ కోల్‌ను మాత్రం శృంగార భాగస్వామిగా ఎంచుకున్నారట.
అంతేకాదు, చెరిల్ నివశిస్తున్న న్యూక్యాజిల్ హౌజింగ్ ఎస్టేట్‌లో... ‘మోస్ట్ ఎట్రాక్టివ్ గాళ్ ఎట్ ద మెట్రో సెంటర్’గాకూడా ఎంపికయ్యింది. ఈ పోల్ సర్వేపై తన ఒపీనియన్‌ను టెలీగ్రాఫ్ పత్రికకు వెలిబుచ్చిన రేచల్... ‘‘ఓ మై గాడ్! దీన్ని నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇప్పటివరకు నేను అధికారికంగా పెళ్ళి చేసుకోకపోయినా, నాకు వైవాహిక జీవితాన్నే గడుపుతున్నాను. అందువల న ఇంకెవరు కూడా నన్ను పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రారేమో అనుకున్నాను. అయితే ఈ పోల్ సర్వే చూసిన తరువాత నాకు నేనే నమ్మలేకపోయాను. నాకు ఇంతమంది అభిమానులున్నారంటే నమ్మలేకపోతున్నా ను.’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచింది.
ముప్పై తొమ్మిదేళ్ళ వయస్సులో కూడా వన్నెతగ్గని రాచెల్ వీజ్ ఇప్పటికీ తన అందచందాలతో టాప్ హీరోయిన్లలో ఒకిరిగా కొనసాగుతోంది. 1995లో ‘డెత్ మెషిన్’ సినిమా తో చిత్రరంగ ప్రవేశం చేసిన రేచల్ ఆ తరువాత ‘చైన్ రియాక్షన్’, ‘స్టీలింగ్ బ్యూటీ’, ‘బెం ట్’ లాంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ... బ్రేక్ కోసం 1998 వచ్చిన ‘ద మమ్మీ’ వర కు వేచిచూడాల్సివచ్చింది. మొదటి సినిమారు ఉత్తమ నటిగా శాటర్న్, ఎంపైర్ లాంటి అవార్డులకు నామినేట్ అయి సంచలనం సృష్టించింది. 2005లో వచ్చిన ‘కాన్‌స్టెంట్ గార్డెనర్’ సినిమా రేచెల్‌ను టాప్ పొజిషన్లోకి తీసుకొచ్చింది.
|