కోటీవుడ్ లో ఎవరెంత పారితోషాకాన్ని తీసుకుంటూ అగ్రస్థానంలో వున్నారనే అంశంపై ఇటీవల ఓ తమిళ పత్రిక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం ప్రముఖుల పారితోషికాల వివరాలిలా వున్నాయి. రజనీకాంత్ రూ.30కోట్లతో మొదటి స్థానంలో వుండగా, కమల్ హసన్ రూ.25కోట్లతో రెండవ స్థానంలో వున్నారు. విజయ్ రూ.10కోట్లు, అజిత్, విక్రమ్ రూ.7కోట్లు, సూర్య రూ.6కోట్లు, సింబూ రూ.5కోట్లు, ధనుష్ రూ.4కోట్లు, జయం రవి, విశాల్ రూ.2కోట్లు, ఆర్య రూ.1కోటితో ఆ తర్వాతి స్థానాలలో వున్నారు. హీరోయిన్ల విషయానికొస్తే... అసిన్ రూ.2కోట్లు తీసుకంటూ ముందంజలో వుండగా, నయనతార, తమన్నా 1కోటి, అనూష్క రూ.75లక్షలు, త్రిష రూ.70లక్షలు, శ్రియ రూ.40లక్షలు తీసుకుంటూ తర్వాతి స్థానాలలో వున్నారు. దర్శకుల్లో...శంకర్ రూ.8కోట్లు, ఎ.ఆర్.మురగదాస్ రూ.7కోట్లతో టాప్ లో వున్నారు. ఇక సంగీత దర్శకుల విషయానికొస్తే... ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమన్ రూ.3కోట్లతో మొదటి స్థానంలో వుండగా, హారీస్ జైరాజ్ రూ.1.60కోట్లు, యువన్ శంకర్ రాజా రూ.1కోటితో ఆ తర్వాతి స్థానాలలో వున్నారు. రోజుకు రూ.6లక్షలు తీసుకుంటూ హాస్యనటుల జాబితాలో వడివేలు ముందువరుసలో వున్నారు.
|