రాఖీ...రాఖీ...రాఖీ...నా కవ్వాసాకీ...పాటను పాపం బాలీవుడ్ ఐటం గాళ్ రాఖీసావంత్‌కు ఇచ్చివుంటే ఆ పాట మరింత పాపులర్ అయ్యేదేమో...అన్నట్లు ఆ మధ్య టీవీ ఛానల్స్ రాఖీసావంత్ పేరు చెప్పుకుని బోలెడంత రేటింగ్ పెంచేసుకున్నాయి. ‘రాఖీకా స్వయంవర్’ ఎంతగా పాపులర్ అయిందో దానిని నిర్వహించిన రాఖీసావంత్ అంతకన్నా పాపులర్ అయింది. అయినా హీరోయిన్‌గా మాత్రం కాదులేండి. ఐటం గాళ్‌గానే రాఖీని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే రాఖీసావంత్ ఈ మధ్య తాను పాల్గొన్న నైట్ పార్టీలలో తన కో...నటీమణులకు గాఢచుంబనాలిచ్చేస్తోందట. ఏదో షేక్‌హ్యాండ్, కౌగిలింతలతో సరిపెట్టక కొత్తగా ఈ ముద్దులేమిటా అని సదరు పార్టీకొచ్చిన మోడల్స్, తారామణులు ఒకింత కలవరపడుతున్నారట.
అవన్నీ పట్టించుకోని రాఖీ మాత్రం తన స్టయిల్‌లో తాను దూసుకుపోతోందట. అయితే ఇదంతా ఆమె కొత్తగా నటించబోయే సినిమా తాలూకు ప్రభావం అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. రాఖీ కొత్తగా నటించబోయే సినిమాలో ఆమె ఒక లెస్బియన్‌గా నటించబోతోందట. అంటే స్వలింగ సంపర్కురాలి పాత్ర అన్నమాట. అందుకు ఇలాంటి పార్టీలు, ఫంక్షన్లనే వేదికగా చేసుకోవాలా అని పార్టీకొచ్చినవాళ్లంతా పక్కకు తిరిగి ఒకటే రాఖీ గురించి కామెంట్స్ చేస్తున్నారట. ఇదేమని ఆమెను కొందరు బాగా తెలిసినవాళ్లు అడిగితే...అదేం లేదని తాను మాత్రం అట్లాంటిదాన్ని కాదని ఆమె సుతిమెత్తగా తోసిపుచ్చుతోంది. పైగా తోటి ఆడవాళ్లకు ముద్దులిచ్చి స్వాగతం పలకడమనేది పాత సాంప్రదాయమేనని...ఇదేదో కొత్తగా చిలవలుపలవలు చేసిచూపిస్తున్నారంటూ ఆమె మీడియాను ఆడిపోసుకుంటోందట...
|