Bookmark and Share   Cinevinodam
Subscribe
 
 
రంభ కోటి రూపాయల హనీమూన్

      తెలుగులో పరిచయమైన హీరోయిన్ రంభ ఆ తర్వాత అగ్రహీరోల చిత్రాల్లో నటించింది. ఆ పిమ్మట హిందీ వైపు మళ్లింది. దివ్య భారతి పోలికలతో పాటు అందాలు కూడా పుష్కలంగా కనువిందు చేయడంతో కొంతకాలం నెట్టుకొచ్చింది.

అలా సంపాదించిన డబ్బుతో ‘‘త్రీ రోజెస్’’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించింది. ఆ మూడు గులాబీల చిత్రం రంభ ఆర్థిక పరిస్థితిని గుచ్చి గుచ్చి పెట్టడం తో పైసలు ఖాళీ అయిపోయాయ్. దీంతో సినీ నిర్మాణానికి స్వస్తి చెప్పి మళ్లీ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఛాన్స్ ల కోసం పాకులాడింది. అయితే ఈ రెండు పరిశ్రమలు పొమ్మని చెప్పడంతో భోజపురి చిత్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అక్కడా అనుకున్నంతగా అవకాశాలు తలుపు తట్టకపోవడంతో ఇటీవలే కెనాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నది. పెళ్లయిన తర్వాత రంభ దంపతులిద్దరూ ఫిజే దేశానికి హనీమూన్ వెళ్లారు. అక్కడ రోజుకు 4 లక్షల రూపాయలు అద్దెతో ఓ భవంతిని తీసుకున్నారు. అలా అక్కడ 14 రోజులు ఎంజాయ్ చేశారు. మొత్తంమీద అద్దెతో కలిసి ఇతర వినోద కార్యక్రమాలకు అయిన ఖర్చు వెరసి కోటి రూపాయలుగా తేలినట్టు తెలిపింది. అదే ఇప్పుడు పెద్ద చర్చ అయి కూర్చుంది.

 
 

Copy right reserved for www.cinevinodam.com 2005