తన అందచందాలతో, అమాయకమైన ముఖంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది
రంభ. ప్రముఖ హీరోలతో నటించిన రంభ తరువాత కొన్ని చిత్రాలలో ఐటమ్ సాంగ్
లలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ
చిత్రాలలో కూడా నటించి తన సత్తా చాటుకుంది. ఈ అందగత్తె ఇటీవల పెళ్ళి
చేసుకున్న విషయమూ తెలిసిందే.
అయితే ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ
నటిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాని, అలాగే దర్శకత్వం చేయాలనేది
తన కోరికని దాని త్వరలోనే నెరవేర్చేసుకుంటానని అంటుంది.
దర్వకత్వం చేయడం కోసం విదేశాల్లో ట్రెయినింగ్ కూడా తీసుకోబోతున్నానని, లేడీ
ఓరియంటెడ్ కథాంశాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని కాబట్టి తాను తీయబోయే
మొదటి చిత్రం ఈ కథాంశంపైనే ఉంటుందని చెప్పుకొచ్చింది.
మరి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించేదెవరు అని అడిగితే, ప్రస్తుతానికి ఏమీ
అనుకోవడం లేదని, అయితే తానే ఆ పాత్ర పోషించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ
సుందరాంగి అంది.
అన్నట్లు రంభ గతంలో నిర్మాతగా ఒక చిత్రం రూపొందించింది. ‘త్రీరోజెస్’ అనే పేరుతో
తమిళంలో ఒక సినిమా తీసింది. ‘చార్లీస్ ఏంజెల్స్’ ఇంగ్లీషు చిత్రం ఆధారంగా
నిర్మించిన ఈ చిత్రంతో ఆర్థికంగా రంభ తీవ్రంగా నష్టపోయింది.
|